Samantha: నా ఎక్స్ కోసం వృథాగా ఖర్చు చేశా: సమంత!

విడాకుల తర్వాత సమంత (Samantha) ఎప్పుడూ తన గత బంధంపై ప్రస్తావనలు చేస్తూ చైతన్యపై  (Naga Chaitanya) ఇన్‌డైరెక్ట్‌గా విమర్శలు చేసేలా మాట్లాడుతుండడం తెలిసిందే. నేరుగా చైతూ పేరు ఎత్తకపోయినా, ఆమె వ్యాఖ్యలు తరచూ చర్చకు దారి తీస్తాయి. తాజాగా వచ్చిన ఒక ఇంటర్వ్యూలో సామ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సమంత ఇటీవల తన బాలీవుడ్ వెంచర్ సిటాడెల్ ప్రమోషన్ కార్యక్రమంలో నటుడు వరుణ్ ధావన్‌తో (Varun Dhawan) పాల్గొన్నారు. ఆ సందర్భంలో వరుణ్ తనను ‘‘మీరు వృథాగా ఖర్చు చేసిన విషయాల గురించి చెప్తారా?’’ అని అడిగాడు.

Samantha

దీనికి సమంత ఆసక్తికరంగా స్పందిస్తూ, ‘‘నా ఎక్స్ కోసం ఖరీదైన బహుమతులు కొనడం ఇప్పుడు వృథాగా ఖర్చు చేసినట్లుగా అనిపిస్తుంది’’ అని అన్నారు. ఈ వ్యాఖ్యల తర్వాత ఆ సందర్భంలో ఉన్నవారంతా షాక్ అయ్యారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. చైతన్య పేరు నేరుగా ఎత్తకపోయినా, సమంత వ్యాఖ్యలు చైతన్యను ఉద్దేశించి చేసినట్లుగా స్పష్టమవుతోంది.

గతంలో విడాకుల సమయంలో కూడా సమంత కొన్ని కోట్స్ ద్వారా చైతూ మీద ఇన్‌డైరెక్ట్ పంచ్‌లు వేసిన విషయం తెలిసిందే. ఈ తరహా వ్యాఖ్యలు అక్కినేని అభిమానుల్లో ఆగ్రహం కలిగిస్తున్నాయి. మరోవైపు, సమంత తన బాధను ఇలా ప్రదర్శించడం సహజమని, విడాకులు ఆమెపై తీవ్ర ప్రభావం చూపాయని కొందరు నెటిజన్లు ఆమెకు మద్దతుగా మాట్లాడుతున్నారు.

గతంలో ఈ బంధం గురించి చైతన్య నెగెటివ్‌గా ఏమీ మాట్లాడకుండా తన గౌరవాన్ని కాపాడుకున్నాడు. కానీ సమంత తరచూ ఈ విషయం ప్రస్తావనలోకి తీసుకురావడం, చైతూను ఇన్‌డైరెక్ట్‌గా విమర్శించడం కొందరికి ఒప్పడంలేదు. ఇక సమంత ప్రస్తుతం తన ప్రొఫెషనల్ కెరీర్‌పై దృష్టి పెట్టింది. పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేస్తూ, సిటాడెల్ వంటి అంతర్జాతీయ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus