Shanmukh, Siri: మరోసారి షణ్ముక్ సిరికి ఎందుకు క్లాస్ పీకాడు..!

బిగ్ బాస్ హౌస్ లో ఫినాలే వీక్ లో భాగంగా హౌస్ మేట్స్ జెర్నీలు అనేవి వారికి మంచి బూస్టప్ ఇచ్చాయి. అంతేకాదు, ఈసారి బిగ్ బాస్ టీమ్ వాళ్ల ఫోటో గ్రాఫ్ ని సైతం అక్కడ పెట్టి వారిలో మరింత ఉత్సాహాన్ని నింపాడు. హౌస్ మేట్స్ అందరూ వాటి గురించి మాట్లాడుతూ, అప్పుడు జరిగిన సంఘటనలని గుర్తు చేసుకుని ఒక సందేశాన్ని బిగ్ బాస్ కి పంపించారు. ఇక సిరి జెర్నీ చూస్తున్నంత సేపు బాగా ఎమోషనల్ అయ్యింది.

షణ్ముక్ – సిరి గేమ్ ఫస్ట్ నుంచీ ఎలా వాళ్లిద్దరూ కలిశారో జెర్నీలో చూపించారు. టాస్క్ లు ఆడిన పద్దతి, షణ్ముక్ సారీ చెప్తూ బ్రతిమిలాడటం, సన్నీతో గొడవ, జెస్సీ ఫ్రెండ్షిప్ ఇవన్నీ కూడా హైలెట్ అయ్యాయి. సిరి మదర్ వచ్చిన తర్వాత సిరి బాగా ఎమోషనల్ అయిపోయింది. అంతేకాదు, షణ్ముక్ తో వాష్ రూమ్ లో జరిగిన గొడవలు, ఆ తర్వాత తనని తాను హర్ట్ చేస్కోవడం, నాగార్జునకి ప్రామిస్ చేయడం ఇవన్నీ కూడా చూపించారు.

ఇక్కడే ఇద్దరూ కలిసి గేమ్ ఆడటానికి వచ్చారని, కంటెంట్ ఇవ్వడానికే వచ్చారని మానస్ అన్నమాటలు సిరికి వినిపించాయి. సిరి జెర్నీ ఎలా సాగిందో మరోసారి షణ్ముక్ తో పంచుకుంది. షణ్ముక్ ఇద్దరూ కంటెంట్ ఇవ్వడానికే వచ్చారని మాట్లాడటం కరెక్ట్ కాదంటూ రుసరుసలాడాడు. అందుకే, నేను వాళ్ల హెల్ప్ తీస్కోవద్దని చెప్పానని ఇప్పుడు నీకు బాగా అర్ధం అయ్యిందా అంటూ మరోసారి క్లాస్ పీకాడు.ఇక దొరికిందే ఛాన్స్ అని సిరి తన ఫోటోలని తీస్కుని వచ్చింది.

షణ్ముక్ తో డ్యాన్స్ చేస్తున్న ఫోటోని సర్ ప్రైజ్ గా చూపిద్దామనుకుని టేబుల్ పైన పెడితే బిగ్ బాస్ టీమ్ దాన్ని మాయం చేసింది. దీంతో నిరాశపడింది సిరి. ఆ తర్వాత పార్టిసిపెంట్స్ చాలా ఉత్సాహంగా ఫోటో టాస్క్ లో పాల్గొన్నారు. ఇంట్లో వాళ్ల మరపురాని క్షణాల గురించి చెప్పుకొచ్చారు.

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!

Most Recommended Video

మహేష్ టు నవీన్… ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన హీరోల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!
అఘోరా గెటప్‌ టాలీవుడ్‌ హీరోలకు కలిసొచ్చిందా!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus