టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అయిన తమన్ కు ట్రోలింగ్ ఏమీ కొత్త కాదు. అతని కెరీర్ ప్రారంభం నుండీ ట్రోలింగ్ ను ఎదుర్కొంటూనే వస్తున్నాడు. గతంలో ఇతను ఎక్కువగా ఏ.ఆర్.రెహమాన్ ట్యూన్లను కాపీ కొట్టేస్తున్నాడంటూ నెటిజన్లు ట్రోల్ చేసేవారు. అటు తరువాత కొట్టిన ట్యూన్లనే మళ్ళీ మళ్ళీ కొట్టేస్తున్నాడు అంటూ విమర్శలు గుప్పించేవారు. ఓ సందర్భంలో హీరో సాయి తేజ్ కూడా స్టేజి పైనే ఈ విషయాన్ని ప్రస్తావించడం తమన్ ను ఇరకాటంలో పెట్టేసింది. అయితే కొద్దిరోజుల తరువాత తమన్ మారాడు. ‘తొలిప్రేమ’ ‘అరవింద సమేత’ చిత్రాలతో ఇతను బౌన్స్ బ్యాక్ అయ్యాడు.
ఇక ‘అల వైకుంఠపురములో’ చిత్రానికి ఇతను అందించిన సంగీతం.. కేవలం టాలీవుడ్ ను మాత్రమే కాదు విదేశాల్లోని ప్రేక్షకులను కూడా చిందులేసేలా చేసాయి. అంతా బానే ఉంది అనుకున్న టైంలో అప్పుడప్పుడు ట్రోలింగ్ కు గురవుతూనే ఉన్నాడు తమన్. ‘సోలో బ్రతుకే సో బెటర్’ టీజర్ విడుదలైనప్పుడు ‘అల వైకుంఠపురములో’ ట్యూన్ ని వాడేసాడంటూ ట్రోల్ చేశారు. అటు తరువాత ‘వి’ సినిమాకి ఇతను అంధించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కు కూడా కాపీ ఆరోపణలు వ్యక్తమయ్యాయి. ‘రాక్షసుడు'(తమిళంలో ‘రాట్ససన్’) చిత్రంలోని విలన్ క్రిష్టాఫర్ థీమ్ ను ఇతను యాజ్ ఇట్ ఈజ్ దింపేసాడు అంటూ విమర్శలు ఎదుర్కొన్నాడు.
ఇక ఇప్పుడు నాని ‘టక్ జగదీష్’ టీజర్ విషయంలో కూడా ట్రోల్స్ ఎదుర్కొంటున్నాడు తమన్. ఆ టీజర్లో డైలాగ్స్ ఉండవు… మొత్తం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తోనే సాగుతుంది. ఈ నేపథ్యంలో ‘ఏటికొక్క పూట.. యానాది పాట..’ అంటూ లేడీ వాయిస్‌తో వచ్చే ట్యూన్.. ‘అల వైకుంఠపురములో’ చిత్రంలోని ‘సిత్తరాల సిరపడు’ ట్యూన్ లా ఉందంటూ ట్రోల్స్ మొదలయ్యాయి. మరి తమన్ దీని పై ఎలా స్పందిస్తాడో చూడాలి..!
Most Recommended Video
పిట్ట కథలు సిరీస్ రివ్యూ & రేటింగ్!
నాంది సినిమా రివ్యూ & రేటింగ్!
పొగరు సినిమా రివ్యూ & రేటింగ్!