Tollywood: ముగిసిపోయాయి అనుకున్నవి మళ్లీ స్టార్ట్‌ అయ్యాయిగా.. పాపం టాలీవుడ్‌?

Ad not loaded.

మొన్నీమధ్య కొత్త సంవత్సరం రాగానే మనం ఓ మాట అనుకున్నాం మీకు గుర్తుండే ఉంటుంది. టాలీవుడ్‌కి (Tollywood) ఇబ్బందికరంగా మారిన ఒక్కో విషయం సమసిపోతూ వస్తోంది. కొన్ని విషయాల్లో కామ్‌నెస్‌ వచ్చింది అని. కానీ ఒక్కసారిగా టాలీవుడ్‌లో పాత పరిస్థితులు వచ్చేశాయి. అవును కావాలంటే మీరే చూడండి సమసిపోయాయి అనుకున్న మూడు వివాదాలు మళ్లీ బయటకు వచ్చాయి. వాటికి మరికొన్ని చిన్నపాటి విషయాలు తోడయ్యాయి. టాలీవుడ్‌లో ఇబ్బందికరంగా మారిన కేసులు చాలా వరకు వారి వారి వ్యక్తిగతమైనవే.

Tollywood

కానీ పరిశ్రమ పేరును చెడగొట్టేలా, వాతావరణాన్ని ఇబ్బంది పెట్టేలా ఆ విషయాలు మారాయి. వాటిలో పెద్ద విషయం మంచు కుటుంబంలో ఇబ్బందులు. మోహన్‌బాబు (Mohan Babu) – మనోజ్‌ (Manchu Manoj)  – విష్ణు (Manchu Vishnu) మధ్య ఆస్తి గొడవలు జరుగుతున్నాయి. మనోజ్‌ తన పోరాటం ఆస్తి కోసం కాదంటున్నా మోహన్‌బాబు మాత్రం ఆస్తి కోసమే అంటున్నారు. కామ్‌గా ఉన్నారు అనుకుంటుంగా మళ్లీ విచారణ, కామెంట్లు మొదలయ్యాయి. రాజ్‌ తరుణ్‌ (Raj Tarun) – లావణ్య మధ్య నెలకొన్న వివాదంలో మస్తాన్‌ సాయి, శేఖర్‌ బాషా లాంటి వాళ్లు వచ్చారు.

ఈ విషయంలోనూ స్టేబుల్‌నెస్‌ వచ్చింది అనుకుంటుండగా మస్తాన్‌ సాయి అరెస్టయ్యారు. దీంతో మరోసారి రాజ్‌ తరుణ్‌ – లావణ్య మ్యాటర్‌ బయటకు వచ్చింది. ఇక జానీ మాస్టర్‌ (Jani Master) – ఆయన లేడీ అసిస్టెంట్‌ విషయం సరేసరి. పోటా పోటీ ఇంటర్వ్యూలతో మళ్లీ ఇష్యూను రేపారు. దీంతో టాలీవుడ్‌ పరిస్థితి మళ్లీ పెనం మీదకు వచ్చినట్లు అయింది. ఈ విషయంలో ఎవరూ ముందుకొచ్చి విషయాలు తేల్చే పరిస్థితి ఉండదు. వాళ్లకు వాళ్లు తేల్చుకోవాలి.

ఇవి కాకుండా మరికొన్ని అంశాలు నివురు గప్పిన నిప్పులా ఉన్నాయి. అందులో ఒకటి నాగార్జున  ( Nagarjuna) – కొండా సురేఖ టాపిక్‌. తన కుటుంబం గురించి మంత్రి అన్నారంటూ నాగ్‌ కోర్టుకెళ్లారు. మరోవైపు అల్లు అర్జున్‌ (Allu Arjun) – సంధ్య థియేటర్‌ ఘటన కేసు ఇంకా తేలలేదు. ఈ నేపథ్యంలో టాలీవుడ్‌ ఎప్పుడు ఈ ఇష్యూస్‌ నుండి బయటపడి ప్రశాంతంగా ఉంటుంది అనే చర్చ నడుస్తోంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus