Venkatesh, Naga Chaitanya: వెంకీ- నాగ చైతన్య కాంబోలో మరో మూవీ!

వెంక‌టేష్ – నాగ‌చైత‌న్య‌ క‌లిసి చేసిన `వెంకీమామ‌` సినిమాలో నటించారు. అంతకు ముందు ‘ప్రేమమ్’ లో కూడా కాసేపు కలిసి కనిపించారు. ఆ రెండు సినిమాలు బాగా ఆడాయి. దగ్గుబాటి- అక్కినేని అభిమానులకి బాగా నచ్చింది. మళ్ళీ ఈ కాంబోలో సినిమా రావాలని అంతా కోరుకుంటున్నారు. వాళ్ళ కోరిక త్వరలోనే నెరవేరబోతుంది. అవును వెంకీ – చైతూ..లను మళ్ళీ స్క్రీన్ పై చూడొచ్చు.
వివరాల్లోకి వెళితే… స్టార్ డైరెక్టర్ సురేంద‌ర్ రెడ్డి ఇటీవల వెంకీని కలిసి ఓ కథ చెప్పడం జరిగింది.

స్టూడియో గ్రీన్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించడానికి ముందుకొచ్చింది. ఈ సినిమా కథ ప్రకారం.. ఓ యంగ్ హీరోకి కూడా స్కోప్ ఉంది. దాని కోసం నాగ‌చైత‌న్యని ఎంపిక చేసుకునే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయట. చైతూ ప్ర‌స్తుతం చందూ మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో ఓ బిగ్ బడ్జెట్ మూవీ చేస్తున్నాడు. మరోపక్క వెంకీ కూడా `సైంధ‌వ్‌` అనే ప్రాజెక్టుతో బిజీగా గడుపుతున్నాడు. కాబట్టి 2024 లో వెంకీ – చైతన్య ల (Venkatesh, Naga Chaitanya) ప్రాజెక్టు సెట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఇక ఈ సినిమాకి భూపతి రాజా కథని అందిస్తున్నారట. అయితే సురేందర్ రెడ్డి తన స్టైల్ కి తగ్గట్టు చాలా మార్పులు చేసుకుంటున్నట్టు తెలుస్తుంది.అలాగే వక్కంతం వంశీ కూడా ఈ సినిమా డైలాగ్ వెర్షన్ కోసం రంగంలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. మరి ‘వెంకీ మామ’ లా ఈ సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందేమో చూడాలి.

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus