వెంకటేష్ మరోసారి రిస్క్ చేస్తాడా..!

‘హిట్'(హిట్ :ది ఫస్ట్ కేస్) (HIT) సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు శైలేష్ కొలను  (Sailesh Kolanu) .తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుని అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత అడివి శేష్ తో  (Adivi Sesh) చేసిన ‘హిట్ 2′(HIT 2) (హిట్ : ది సెకండ్ కేస్) కూడా హిట్టే. అయితే మధ్యలో చేసిన ‘హిట్’ హిందీ రీమేక్ శైలేష్ స్పీడ్ కు బ్రేకులు వేసింది. అయితే తెలుగులో 2 హిట్లు ఇచ్చాడు కాబట్టి శైలేష్ ను.. పిలిచి మరీ ఛాన్స్ ఇచ్చాడు వెంకటేష్ (Venkatesh). అలా ‘సైందవ్’ (Saindhav) చేయడం జరిగింది.

Venkatesh, Sailesh Kolanu

అది వెంకటేష్ కెరీర్లో 75 వ సినిమా.. అంటే ల్యాండ్ మార్క్ మూవీ. అలాంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ని శైలేష్ కు అప్పగించాడు అంటే.. వెంకీ ఏ రేంజ్లో ఇంప్రెస్ అయితే అలాంటి డెసిషన్ తీసుకుంటారు. ముందుగా టీజర్ చూశాక కచ్చితంగా ‘సైందవ్’ సూపర్ హిట్ అవుతుంది అని అంతా అనుకున్నారు. ఒకవేళ ముందుగా అనౌన్స్ చేసినట్టు డిసెంబర్ ఎండింగ్లో వస్తే.. టార్గెటెడ్ ఆడియన్స్ ఆ సినిమాని చూసేవారేమో. కానీ సంక్రాంతికి రిలీజ్ చేయడం వల్ల.. ఈ సినిమాపై ఆడియన్స్ ఆసక్తి చూపలేదు.

అయితే ‘సైందవ్’ ఆడకపోయినా వెంకటేష్.. శైలేష్ కి అండగా నిలిచారట. మోరల్ సపోర్ట్ ఇచ్చినట్టు కూడా శైలేష్ చెప్పుకొచ్చాడు. అలాంటి గొప్ప వ్యక్తికి హిట్ ఇవ్వలేకపోయానే అనే బాధ ఉండిపోయింది అని శైలేష్ అన్నాడు. కచ్చితంగా వెంకటేష్ గారికి ఒక హిట్టు సినిమా చేయాలని ఆశగా ఉంది అంటూ శైలేష్ తెలిపాడు. ‘హిట్ 3’ (HIT 3) హిట్ అయ్యింది కాబట్టి.. వెంకటేష్ నుండి మళ్ళీ పిలుపు వస్తుందేమో చూడాలి.

పూజ.. చెయ్యక చెయ్యక చేస్తే.. కష్టం వేస్ట్ అయిపోయింది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus