మరోసారి మహేష్ చిత్రాన్ని రీమేక్ చేయబోతున్న విజయ్..?

మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి డైరెక్షన్లో రూపొందిన ‘మహర్షి’ చిత్రం మే 9న విడుదల కానున్న సంగతి తెలిసిందే. మహేష్ 25 వ చిత్రం కావడంతో భారీస్థాయిలో ‘మహర్షి’ ని భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు. కంటెంట్ ఉన్న సినిమా అని ట్రైలర్ చూస్తే స్పష్టమవుతుంది అంటూ చాలా మంది సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. మూడు డిఫరెంట్ లుక్స్ తో మహేష్ కనిపిస్తుండడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పాటలు అంతగా మెప్పించకపోవడంతో మొదట ఈ చిత్రం పై పెద్దగా అంచనాలు లేవు.. కానీ తాజాగా విడుదలైన ట్రైలర్ ప్రామిసింగ్ గా ఉండడంతో ఈ చిత్రం పై అమాంతం అంచనాలు పెరిగిపోయాయి. ఇక మహేష్ కెరీర్లో ఈ చిత్రం మరో బ్లాక్ బస్టర్ గా నిలవడం ఖాయమనే టాక్ ఫిలింనగర్లో బలంగా వినిపిస్తుంది.

ఏ మాత్రం ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చినా.. రికార్డు కలెక్షన్లు రావడం ఖాయం. అందులోనూ ఈ సంవత్సరం ‘వినయ విధేయ రామ’ తరువాత వచ్చే పెద్ద సినిమా ఇదేకావడం ఈ చిత్రానికి కలిసొచ్చే అంశం. ఇదిలా ఉండగా ఈ చిత్రం రీమేక్ పై తమిళ స్టార్ హీరో విజయ్ దృష్టిపెట్టినట్టుగా వార్తలొస్తున్నాయి. గతంలో ‘ఒక్కడు’ ‘పోకిరి’ వంటి మహేష్ బాబు సూపర్ హిట్ చిత్రాల్ని కూడా విజయ్ హీరోగా రీమేక్ చేశారు. అప్పుడు ప్లాపుల్లో ఉన్న విజయ్ కు ఈ చిత్రాలే హిట్టందించాయి. ఇప్పుడు మరోసారి ‘మహర్షి’ సినిమా రీమేక్ పై విజయ్ పెట్టాడట. అయితే ఈ చిత్రం దాదాపు విజయ్ నటించిన ‘కత్తి’, ‘మెర్సెల్’ చిత్రాలకి దగ్గరగా ఉంది అయినా విజయ్ రీమేక్ చేయాలనీ ఎందుకు అనుకుంటున్నాడు అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరి చివరికి ఏం జరుగుతుందో చూడాలి. ఇక విజయ్ ప్రస్తుతం అట్లీ డైరెక్షన్లో తన 63 వ చిత్రం చేస్తున్నాడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus