Jr NTR Remuneration: ఆ జాబితాలో యంగ్ టైగర్ చేరతారా?

రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన బాహుబలి, బాహుబలి2 సినిమాలు బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులను క్రియేట్ చేశాయి. బాహుబలి సిరీస్ సినిమాలతో వచ్చిన క్రేజ్ వల్ల ప్రభాస్ మార్కెట్ తో పాటు రెమ్యునరేషన్ కూడా ఊహించని స్థాయిలో పెరిగింది. ఆర్ఆర్ఆర్ మూవీలో చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తుండగా చరణ్ ఇప్పటికే తన పారితోషికాన్ని పెంచేశారని వార్తలు వస్తున్నాయి. ఒక్కో సినిమాకు చరణ్ 100 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్నారని బోగట్టా.

నిర్మాతలు పారితోషికాన్ని ఇప్పటికే చరణ్ కు ఇచ్చేశారని రెండు సినిమాలకు చరణ్ 200 కోట్ల రూపాయల పారితోషికాన్ని తీసుకున్నారని సమాచారం. ఆర్ఆర్ఆర్ సినిమాకు ఎన్టీఆర్ రెమ్యునరేషన్ 45 కోట్ల రూపాయలు కాగా తారక్ కూడా పారితోషికాన్ని 100 కోట్ల రూపాయలకు పెంచేస్తారా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ భవిష్యత్తు సినిమాలు కొరటాల శివ, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్నాయి. ఎన్టీఆర్ కొరటాల శివ కాంబో మూవీ యువసుధ ఆర్ట్స్ బ్యానర్ తో పాటు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న నేపథ్యంలో ఎన్టీఆర్ ఈ సినిమాకు పారితోషికం కాకుండా లాభాల్లో వాటా తీసుకునే అవకాశం ఉంది.

ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కే సినిమాతో ఎన్టీఆర్ పారితోషికం గురించి క్లారిటీ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఆర్ఆర్ఆర్ రిలీజైన తర్వాత వచ్చే ఆఫర్లను బట్టి ఎన్టీఆర్ రెమ్యునరేషన్ ఫిక్స్ అవుతుందని చెప్పవచ్చు. ఎన్టీఆర్ కథల విషయంలో, డైరెక్టర్ల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. భవిష్యత్తు సినిమాలు సైతం సక్సెస్ సాధించే విధంగా ఎన్టీఆర్ కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు. కథ నచ్చితే బాలీవుడ్ ఇండస్ట్రీలోకి కూడా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎంట్రీ ఇవ్వనున్నారు.

ఆర్ఆర్ఆర్ సినిమాలో తారక్ కొమురం భీమ్ రోల్ లో నటించారు. ఎన్టీఆర్ గత మూడేళ్లుగా ఈ సినిమాకు పరిమితమైన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో కష్టానికి తగిన ఫలితం దక్కుతుందని తారక్ భావిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది. త్వరలో తారక్ 100 కోట్ల రూపాయల పారితోషికం తీసుకునే హీరోల జాబితాలో చేరాతారేమో చూడాల్సి ఉంది.

శ్యామ్ సింగరాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

83 సినిమా రివ్యూ & రేటింగ్!
వామ్మో.. తమన్నా ఇన్ని సినిమాల్ని మిస్ చేసుకుండా..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus