NBK108: టాలీవుడ్ లో ఇలా చేయడం తొలిసారి.. బాలయ్యకే సాధ్యమంటూ?

బాలయ్య అనిల్ రావిపూడి కాంబో మూవీ టైటిల్ ను మరికొన్ని గంటల్లో ప్రకటించనున్నారు. ఈ నెల 8వ తేదీన ఈ సినిమా టైటిల్ కు సంబంధించిన అధికారిక ప్రకటన రానుండటంతో అభిమానులు సంతోషిస్తున్నారు. అటు బాలయ్య, ఇటు అనిల్ రావిపూడి సినీ కెరీర్ లో హైయెస్ట్ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కిందని తెలుస్తోంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ ను వేరే లెవెల్ లో ప్లాన్ చేశారని తెలుస్తోంది.
ఈ సినిమా బాలయ్య 108వ సినిమా కావడంతో 108 హోర్డింగ్స్ తో ఈ సినిమా టైటిల్ ప్రకటించనున్నారని సమాచారం.

టాలీవుడ్ లో ఒక సినిమా కోసం ఈ స్థాయిలో హోర్డింగ్స్ క్రియేట్ చేయడం ఈ సినిమాకు మాత్రమే జరిగింది. బాలయ్యకు మాత్రమే ఇది సాధ్యమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమాలో కాజల్, శ్రీలీల కీలక పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. బాలయ్య అనిల్ కాంబో మూవీ టైటిల్ ఇదేనంటూ వేర్వేరు టైటిల్స్ ప్రచారంలోకి వస్తుండగా బాలయ్య ఫ్యాన్స్ మాత్రం అధికారికంగా ప్రకటించే వరకు టైటిల్ విషయంలో ఎదురుచూపులు తప్పవని చెబుతున్నారు.

షైన్ స్క్రీన్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతుండగా బాలయ్య అభిమానులు ఈ సినిమాపై భారీ స్థాయిలోనే ఆశలు పెట్టుకున్నారు. దసరా కానుకగా ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. టైటిల్ తో పాటు ఈ సినిమా రిలీజ్ డేట్ ను సైతం అధికారికంగా ప్రకటిస్తారని తెలుస్తోంది. బాలయ్య ఈ సినిమాతో హ్యాట్రిక్ సాధించాలని భావిస్తుండగా ఆ కోరిక నెరవేరుతుందో లేదో చూడాల్సి ఉంది.

వరుస ప్రాజెక్ట్ లతో కెరీర్ పరంగా బాలయ్య బిజీగా ఉన్నారు. బాలయ్య త్వరలో కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటిస్తారని భారీ బడ్జెట్ తో బాలయ్య సినిమాలు తెరకెక్కనున్నాయని సమాచారం అందుతోంది. బాలయ్య పారితోషికం 25 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని తెలుస్తోంది.

ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!

టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus