Prabhas: ఆ సినిమా వల్ల ఆదిపురుష్ కు ఇబ్బందులు.. ఏం జరిగిందంటే?

ఆదిపురుష్ మూవీ రిలీజ్ కు దగ్గర పడుతుండగా అదే సమయంలో ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం థియేటర్లలో ప్రదర్శితం అవుతున్న సినిమాలలో ఏ సినిమా కూడా ఆశించిన రేంజ్ లో కలెక్షన్లను సొంతం చేసుకోవడం లేదు. ఆదిపురుష్ మూవీ ఆ లోటును తీరుస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఆదిపురుష్ మూవీ 600 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోందని తెలుస్తోంది. అయితే రిలీజ్ కు ముందు ఆదిపురుష్ మూవీకి షాకులు తగులుతుండటం గమనార్హం.

ఆదిపురుష్ సినిమాకు సంబంధించి ఐమ్యాక్స్ వెర్షన్ లేదని సమాచారం అందుతోంది. హాలీవుడ్ మూవీ ది ఫ్లాష్ కోసం ఈ థియేటర్లను ఎప్పుడో బ్లాక్ చేశారని సమాచారం. ఈ రీజన్ వల్లే ఆదిపురుష్ మూవీ ఐమ్యాక్స్ థియేటర్లలో ప్రదర్శితం కాదని తెలుస్తోంది. ఈ విషయం తెలిసిన అభిమానులు షాకవుతున్నారు. ఆదిపురుష్ మూవీ రిలీజ్ డేట్ మారడం వల్లే ఈ సమస్య వచ్చిందని సమాచారం అందుతోంది.

విజువల్ గ్రాండియర్ సినిమాలకు ఐమ్యాక్స్ బెస్ట్ ఆప్షన్ కాగా ఐమ్యాక్స్ స్క్రీన్లు చేజారడం వల్ల ఆదిపురుష్ కలెక్షన్లపై కొంతమేర ఎఫెక్ట్ పడే ఛాన్స్ అయితే ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. తెలుగు రాష్ట్రాల్లో ఐమ్యాక్స్ ప్రొజెక్షన్లు ఎక్కువగా లేవు కాబట్టి అభిమానులకు ఇబ్బంది లేదు. ఇతర రాష్ట్రాల్లో నివశించే ప్రభాస్ అభిమానులు మాత్రం ఒకింత ఇబ్బందులు పడక తప్పదు.

ప్రభాస్ (Prabhas) రెమ్యునరేషన్ సైతం భారీ రేంజ్ లో ఉంది. ప్రభాస్ కు వరుస విజయాలు దక్కాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. రాబోయే రోజుల్లో ప్రభాస్ సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడంతో పాటు బాక్సాఫీస్ వద్ద హవా కొనసాగించాలని కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రభాస్ రేంజ్ ఊహించని స్థాయిలో పెరుగుతుండగా ఇతర భాషల డైరెక్టర్లు సైతం ప్రభాస్ సినిమాలకు దర్శకత్వం వహించే లక్కీ ఛాన్స్ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.

టక్కర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!

అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్లు వీళ్లేనా..!/a>
కలెక్షన్లలో దూసుకుపోతున్న లేడీ ఓరియంటల్ సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus