Adipurush: మరో వివాదంలో చిక్కుకున్న ఆదిపురుష్.. ఏం జరిగిందంటే?

ఈ మధ్య కాలంలో ఆదిపురుష్ మూవీ చిక్కుకున్న స్థాయిలో మరే సినిమా వివాదాల్లో చిక్కుకోలేదు. ఈ సినిమా విడుదల తర్వాత ఈ మూవీ మరిన్ని వివాదాల్లో చిక్కుకుంటూ ఉండటం ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు. ఆదిపురుష్ సినిమాలో సీతమ్మ గొంతు కోసినట్లు చూపించడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ప్రముఖ రాజకీయ నేతలు ఈ సినిమాపై విమర్శలు చేస్తున్నారు.
ఆప్ ఎంపీ సంజయ్ కుమార్ మాట్లాడుతూ ఆదిపురుష్ మూవీ చూస్తుంటే బాధతో కన్నీళ్లు వస్తున్నాయని ఆయన అన్నారు.

సీతారాములు, ఆంజనేయుడు పేర్లు వింటే భక్తిభావం ఉప్పొంగుతుందని కానీ ఆదిపురుష్ మూవీలో మాత్రం వీధుల్లో మాట్లాడే భాషను ఉపయోగించారని సంజయ్ కుమార్ వెల్లడించడం గమనార్హం. సినిమాలో సీతమ్మ గొంతు కోసినట్లు చూపించారని ఆయన చెప్పారు. ఆదిపురుష్ రైటర్ మన దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని ప్రియాంక సింగ్ చతుర్వేది కామెంట్లు చేశారు. హనుమంతుని డైలాగ్స్ వల్ల మనోభావాలు దెబ్బ తిన్నాయని ఆమె కామెంట్లు చేశారు.

ఆదిపురుష్ (Adipurush) సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే మూడు రోజుల్లో ఈ సినిమాకు 340 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. ఆదిపురుష్ సినిమా వీక్ డేస్ కలెక్షన్లు ఏ విధంగా ఉంటాయో చూడాల్సి ఉంది. ఆదిపురుష్ మూవీ రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులను క్రియేట్ చేయనుందని తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 250 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధిస్తే మాత్రమే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది.

బాక్సాఫీస్ వద్ద పోటీ లేకపోవడం ఈ సినిమాకు కలిసొచ్చిందని సమాచారం అందుతోంది. ఆదిపురుష్ మూవీకి రాబోయే రోజుల్లో కూడా భారీ కలెక్షన్లు రావాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఆదిపురుష్ రిజల్ట్ గురించి ప్రభాస్ నుంచి మాత్రం ఎలాంటి స్పందన లేదు.ప్రస్తుతం ప్రభాస్ అమెరికాలో కాలికి సంబంధించిన చికిత్స తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus