పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ కి (Prabhas) దేశ విదేశాలలో ఫాన్స్ ఉన్నారు. ఈ నేపథ్యంలో దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకునే నటుడిగా అవతరించాడు అనడంలో అతిశయోక్తి లేదు. ఈ క్రమంలో ప్రస్తుతం అతని చేతిలో ఉన్న సినిమాలు అన్నీ కూడా పాన్ ప్రాజెక్ట్స్ కావడం విశేషం. దాంతో ఆటోమెటిగ్గానే డార్లింగ్ ప్రభాస్ కొన్నాళ్లుగా బిజీబిజీగా మారుతూ సినిమాలు ఫినిష్ చేస్తున్నాడు. ఈ క్రమంలో షూటింగ్ సమయాల్లో అతనికి గాయాలు తగిలినప్పటికీ, ట్రీట్మెంట్ చేయించుకొని మరీ సినిమాలు కానిచ్చేస్తున్నాడు.
ప్రస్తుతం ప్రభాస్ వెకేషన్లో ఉన్నాడు. కాగా త్వరలో హైదరాబాద్‌కు తిరిగి రానున్నారు. అయితే ప్రభాస్ ఈ 2025 సంవత్సరం కూడా చాలా బిజీగా తన సినిమాలతో గడపనున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ మారుతీ (Maruthi Dasari) దర్శకత్వంలో “రాజా సాబ్” (The Rajasaab) చిత్రీకరణను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి కాగా త్వరలో పెండింగ్‌లో ఉన్న 4 పాటలు కూడా పూర్తి చేయనున్నాడని టాక్ నడుస్తోంది. ఆ తరువాత దరకుడు హను రాఘవపూడి (Hanu Raghavapudi) “ఫౌజీ” మూవీ షెడ్యూల్‌లను పూర్తి చేయనున్నాడు.
ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయిన సంగతి విదితమే. ఇక ఆ తరువాత దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) స్పిరిట్ (Spirit) కోసం ప్రభాస్ బల్క్ డేట్స్ కేటాయించనున్నాడు. ఈ ఏడాది ఎక్కువ సమయంపాటు ఈ సినిమా కోసమే కేటాయించనున్నాడట దాలింగ్ ప్రభాస్. ఈ సినిమాలో ప్రభాస్ ఓ పవర్ ఫుల్ పోలీసుగా కనిపించనున్నాడు. ఇవి మాత్రమే కాకుండా మరో 2 ప్రాజెక్ట్స్ ప్రస్తుతం డిస్కషన్ స్టేజ్‌లో ఉన్నాయని, త్వరలోనే వాటిని ఎనౌన్స్ చేయబోతున్నట్టు తెలుస్తోంది.
మొత్తంగా చెప్పుకోవాలనుంటే… గత సంవత్సరాలతో పోల్చితే ప్రభాస్ 2025లో అత్యంత బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది. దాదాపుగా ఒకేసారి మూడు నాలుగు సినిమాలను ఏకకాలంలో చేయబోతున్నందున అతనికి ఈ సంవత్సరం పెద్ద విరామం అనేది ఉండదు.