సూపర్ స్టార్ మహేష్ బాబుకు సోషల్ మీడియాలో భారీ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనే సంగతి తెలిసిందే. గుంటూరు కారం మహేష్ బాబు రేంజ్ ను పెంచే మూవీ అవుతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. జూన్ నెల 10వ తేదీ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుందని తెలుస్తోంది. అక్టోబర్ చివరి వారం సమయానికి ఈ సినిమాను పూర్తి చేయాలని మహేష్ బాబు భావిస్తున్నారు. ఇప్పటివరకు కేవలం 30 శాతం షూటింగ్ మాత్రమే పూర్తైందని తెలుస్తోంది.
మిగతా సన్నివేశాల షూటింగ్ వేగంగా పూర్తి చేసి వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నార. మరోవైపు మహేష్ బాబు ఒక మొబైల్ యాడ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఈ నెల పదో తేదీ నాటికి ఈ యాడ్ షూటింగ్ పూర్తి కానుందని సమాచారం అందుతోంది. ఈ సినిమాలో పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. మహేష్ సినిమాలన్నీ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండగా ఈ సినిమాలపై అంచనాలు సైతం అంతకంతకూ పెరుగుతున్నాయి.
రెండేళ్లకు ఒక సినిమాలో నటించేలా (Mahesh Babu) మహేష్ బాబు కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు. అతడు, ఖలేజా సినిమాల తర్వాత మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ ఇదేననే సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు 30 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికం తీసుకుంటున్నారు. రాజమౌళి మహేష్ కాంబో మూవీ షూట్ విదేశాల్లో జరగనుంది.
ఈ సినిమా కోసం ఇప్పటికే షూటింగ్ లొకేషన్లను ఫైనల్ చేశారని తెలుస్తోంది. జక్కన్న సినిమా కోసం మహేష్ తన లుక్ ను మార్చుకుంటున్నారని ఈ సినిమాలో మహేష్ లుక్ కొత్తగా ఉండనుందని సమాచారం. సూపర్ స్టార్ మహేష్ బాబు భవిష్యత్తు ప్రాజెక్ట్ లు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచే విధంగా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు.
మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!
మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!