స్టార్ హీరో ప్రభాస్ నటించిన రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలు ఇప్పటికే షూటింగ్ ను పూర్తి చేసుకున్నాయి. రాధేశ్యామ్ సినిమా కరోనా కేసులు తగ్గిన తర్వాత విడుదల కానుండగా ఆదిపురుష్ సినిమా మాత్రం ఈ ఏడాది ఆగష్టు నెల 11వ తేదీన విడుదల కానుంది. ఆదిపురుష్ సినిమాలో స్టార్ హీరో ప్రభాస్ రాముడి పాత్రలో నటించగా కృతిసనన్ సీత పాత్రను పోషించారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు.
పది కంటే ఎక్కువ భాషలలో ఆదిపురుష్ సినిమా రిలీజ్ కానుంది. 20,000కు పైగా థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ వార్త నిజమైతే ప్రభాస్ ఫ్యాన్స్ కు పండగేనని చెప్పవచ్చు. రామాయణం గురించి ప్రేక్షకులకు తెలియని కొత్త విషయాలను ఈ సినిమాలో ప్రస్తావించనున్నారని బోగట్టా. ప్రస్తుతం ఆదిపురుష్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమాలో విలన్ రోల్ లో నటిస్తున్నారు.
త్వరలో ఆదిపురుష్ సినిమా ప్రమోషన్స్ ను మొదలుపెట్టాలని మేకర్స్ భావిస్తున్నారు. 300 కోట్ల రూపాయలకు పైగా భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ దేశాల్లో ఈ సినిమాను విడుదల చేయాలని మేకర్స్ అనుకుంటున్నారు. విజువల్ వండర్ గా తెరకెక్కుతున్న ఆదిపురుష్ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ కెరీర్ ను కొనసాగిస్తున్నారు. మరోవైపు రాధేశ్యామ్ రిలీజ్ డేట్ గురించి క్లారిటీ రావాల్సి ఉంది.
ఏపీలో 50 శాతం ఆక్యుపెన్సీ నిబంధనలు అమలులోకి రావడంతో థియేటర్లలో పెద్ద సినిమాలను రిలీజ్ చేసే విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 100 శాతం ఆక్యుపెన్సీకి అనుమతులు వచ్చిన తర్వాతే ఏపీలో పెద్ద సినిమాలు థియేటర్లలో విడుదలయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు. ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాలు అన్నీ భారీ బడ్జెట్ సినిమాలు కాగా ఏడాదికి రెండు లేదా మూడు సినిమాలు విడుదలయ్యేలా ప్రభాస్ కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు.
Most Recommended Video
ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!