ఈ మధ్య కాలంలో పెద్ద సినిమాల నిడివి విషయంలో దర్శకులు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్2 సినిమాల నిడివి ఎక్కువైనా ప్రేక్షకులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నిబంధన అన్ని సినిమాలకు వర్తించదు. రెండున్నర గంటల కంటే నిడివి ఎక్కువగా ఉంటే మాత్రం అనవసరమైన సన్నివేశాలను దర్శకులు తొలగిస్తే మాత్రమే పెద్ద సినిమాలకు ప్రయోజనం చేకూరుతుంది. ఆచార్య సినిమా మెగా మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.
ఈ నెల 23వ తేదీన ఆచార్య మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుందని ఈ ఈవెంట్ కు సీఎం జగన్ ముఖ్య అతిథిగా హాజరయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. భారీ బడ్జెట్ తో ఆచార్య మూవీ తెరకెక్కగా మెగా ఫ్యాన్స్ ఈ సినిమా కొరకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో చరణ్ పాత్ర నిడివి కేవలం 25 నిమిషాలు అనే సంగతి తెలిసిందే. అయితే ఎడిటింగ్ లో చరణ్ పాత్ర నిడివి మరింత తగ్గిందని సమాచారం అందుతోంది.
సినిమా రన్ టైమ్ బాగా ఎక్కువగా ఉండటంతో మేకర్స్ మరో ఆప్షన్ లేక చరణ్ పాత్రను తగ్గించారని తెలుస్తోంది. మూవీలో ఎక్స్టెండెడ్ కామియో రోల్ లా చరణ్ పాత్రను మేకర్స్ చూపించనున్నారని బోగట్టా. అయితే వైరల్ అవుతున్న వార్తల గురించి మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. మరోవైపు ట్రైలర్ లో కాజల్ అగర్వాల్ కనిపించలేదనే సంగతి తెలిసిందే. ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజున ఆచార్య మూవీ నుంచి మరో ట్రైలర్ రిలీజ్ కానుంది.
ఆ ట్రైలర్ లో కాజల్ ను చూపించే ఛాన్స్ ఉందని బోగట్టా. అంచనాలను తగ్గించాలనే ఆలోచనతో కొరటాల శివ ఫస్ట్ ట్రైలర్ లో ఎమోషనల్ సీన్స్ ను చూపించలేదని బోగట్టా. మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందించగా చరణ్ కు జోడీగా పూజా హెగ్డే ఈ సినిమాలో నటించారు. చరణ్, పూజా హెగ్డేలకు ఈ సినిమా సక్సెస్ కీలకమని చెప్పవచ్చు.
Most Recommended Video
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!