అల్లు అర్జున్ సినిమా నైజాంలో మరో రికార్డు?

  • January 27, 2020 / 08:05 PM IST

2020 సంక్రాంతికి ‘అల వైకుంఠపురములో’ చిత్రం విన్నర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే 3వ వారంలోకి ఎంటరైనా ఈ చిత్రం కలెక్షన్లు తగ్గకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. ఇప్పటికీ ఈ చిత్రం 600 కి పైగా థియేటర్లలో ప్రదర్శింపబడుతోంది. డిమాండ్ ను బట్టి మరికొన్ని షోలు కూడా పెంచుతూనే ఉన్నారు. కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు… ఓవర్సీస్ లో కూడా ఈ చిత్రం కుమ్ముడు మాములుగా లేదు. ఇప్పటికే అక్కడ 3.4 మిలియన్ డాలర్లను సాధించింది.

ఇక నైజాంలో కూడా ఈ చిత్రం పెర్ఫార్మన్స్.. అస్సలు తగ్గాడం లేదు. ఇక్కడ ఈ చిత్రం ఇప్పటికే 38.95 కోట్ల రూపాయల షేర్ ను రాబట్టింది. మరో రెండు, మూడు రోజుల్లో 40కోట్ల షేర్ మార్క్ ను అందుకునే దిశగా దూసుకుపోతుంది. ఒకవేళ ఆ ఫీట్ ను సాధిస్తే.. ‘బాహుబలి’ సిరీస్ కాకుండా ఆ ఫీట్ ను సాధించిన సినిమాగా ‘అల వైకుంఠపురములో’ మరో రికార్డుని క్రియేట్ చేసినట్టే..! ఇక నైజాంలో అత్యధిక కలెక్షన్లను రాబట్టిన చిత్రాల లిస్ట్ ను ఓసారి చూస్తే :

1) బాహుబలి 2 : 68కోట్లు (షేర్)

2) బాహుబలి ది బిగినింగ్ : 43 కోట్లు (షేర్)

3) అల వైకుంఠపురములో : 38.95 కోట్లు (షేర్)

4) సరిలేరు నీకెవ్వరు : 36.70 కోట్లు (షేర్)

5) సైరా నరసింహారెడ్డి : 32.51 కోట్లు (షేర్)

6) మహర్షి : 30.86 కోట్లు (షేర్)

ఫుల్ రన్లో ‘అల వైకుంఠపురములో’ చిత్రం నైజాంలో ‘బాహుబలి ది బిగినింగ్’ కలెక్షన్లను కూడా అధిగమించే అవకాశం ఉంది.

డిస్కో రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus