Balakrishna: 20 ఏళ్ల తర్వాత అక్కడ సత్తా చాటిన బాలయ్య!

ప్రతి స్టార్ హీరో కెరీర్ లో కొన్ని సినిమాలు స్పెషల్ సినిమాలుగా నిలవడంతో పాటు ఊహించని స్థాయిలో సక్సెస్ ను సొంతం చేసుకుంటాయి. బాలయ్య సినీ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు ఉన్నా గత నెలలో విడుదలై సక్సెస్ సాధించిన అఖండ సినిమా గురించి ప్రేక్షకుల మధ్య జోరుగా చర్చ జరుగుతోంది. మూడు రోజుల క్రితం ఓటీటీలో అందుబాటులోకి వచ్చిన ఈ సినిమా రికార్డు స్థాయిలో వ్యూస్ ను సొంతం చేసుకుంటుండటం గమనార్హం.

బాలయ్య నటనకు ఫిదా అవుతున్న అభిమానులు సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ఓటీటీలో అఖండ అందుబాటులోకి వచ్చినా తెలుగు రాష్ట్రాల్లోని పరిమిత సంఖ్యలో థియేటర్లలో ఈ సినిమా ప్రదర్శితమవుతోంది. 2001 సంవత్సరంలో బాలయ్య నటించి విడుదలైన నరసింహ నాయుడు సినిమా హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో కోటి రూపాయల మార్క్ ను టచ్ చేసిన సంగతి తెలిసిందే. దాదాపుగా రెండు దశాబ్దాల తర్వాత అఖండ సినిమా అదే ఫీట్ ను రిపీట్ చేసింది.

సుదర్శన్ థియేటర్ లో నిన్నటి కలెక్షన్లతో అఖండ ఖాతాలో ఈ రికార్డ్ చేరింది. అఖండ భారీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో పాటు రికార్డులు సృష్టిస్తుండటంతో బాలయ్య అభిమానులు సోషల్ మీడియా వేదికగా హంగామా చేస్తున్నారు. ఫుల్ రన్ లో ఈ సినిమా దాదాపుగా 74 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు సాధించింది. బాలయ్య అఖండ సక్సెస్ ఇచ్చిన సంతోషం వల్ల తను హీరోగా తెరకెక్కే కొత్త సినిమాలను వేగంగా మొదలుపెట్టాలని అనుకుంటున్నారు.

గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో బాలయ్య హీరోగా తెరకెక్కే మూవీ షూటింగ్ అతి త్వరలో మొదలు కానుంది. శృతి హాసన్ ఈ సినిమాలో హీరోయిన్ గా ఎంపిక కాగా ఆమె పాత్ర వెరైటీగా ఉంటుందని సమాచారం అందుతోంది. బాలయ్య గోపీచంద్ మలినేని కాంబో మూవీకి వేటపాలెం, పెద్దాయన, జై బాలయ్య టైటిల్స్ వినిపిస్తుండగా ఈ టైటిల్స్ లో ఏదో ఒక టైటిల్ ఫైనల్ అయ్యే ఛాన్స్ ఉంది.

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus