Mahesh Babu: అక్కడ కూడా సత్తా చాటుతున్న సూపర్ స్టార్!

సూపర్ స్టార్ మహేష్ బాబు ఖాతాలో ఎన్నో రికార్డులు ఉన్నాయి. ఈ ఏడాది మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట, మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీ రిలీజ్ కానున్నాయి. మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీ షూటింగ్ ఆలస్యమవుతున్నా ఈ ఏడాది దసరాకు ఈ సినిమా రిలీజయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. అయితే మహేష్ బాబు దేశంలో మరే హీరోకు లేని అరుదైన రికార్డులను సొంతం చేసుకుంటున్నారు. మహేష్ బాబుకు సోషల్ మీడియాలో ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ అంతాఇంతా కాదు.

తన ట్విట్టర్ ద్వారా సూపర్ స్టార్ రేర్ రికార్డును సాధించారు. ఒక పోస్ట్ కు లక్ష కంటే ఎక్కువ లైక్స్ ఉన్న పోస్టులు 30 కంటే ఎక్కువగా ఉన్న ఏకైక హీరో మహేష్ బాబు కావడం గమనార్హం. వివాదాలకు దూరంగా ఉండటంతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే సినిమాల్లో నటించడం వల్లే మహేష్ ఖాతాలో సాలిడ్ రికార్డులు చేరుతున్నాయి. 2022 సంవత్సరంలో నూతన సంవత్సరం రోజున మహేష్ బాబు చేసిన ఫస్ట్ పోస్ట్ కు లక్షకు పైగా లైక్స్ వచ్చాయి.

ట్విట్టర్ లో మరే హీరోకు లేని స్థాయిలో మహేష్ కు క్రేజ్ ఉండటం ఇతర హీరోలను సైతం ఆశ్చర్యపరుస్తోంది. మహేష్ ట్విట్టర్ ఖాతాకు 12 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నాయి. అయితే మహేష్ బాబు మాత్రం కేవలం 29 ట్విట్టర్ ఖాతాలను ఫాలో అవుతున్నారు. సర్జరీ వల్ల ప్రస్తుతం మహేష్ రెస్ట్ తీసుకుంటున్నారు. సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సిన మహేష్ మూవీ సర్కారు వారి పాట సమ్మర్ కు మారింది. సర్కారు వారి పాట షూటింగ్ దాదాపుగా పూర్తి కావడంతో ఈ సినిమా రిలీజ్ డేట్ లో మార్పు లేకపోవచ్చని బోగట్టా.

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించగా కలెక్షన్లపరంగా ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేస్తుందని అభిమానులు భావిస్తున్నారు. పరశురామ్ పెట్ల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus