Devara: అక్కడ తారక్ ఖాతాలో మరో సంచలన రికార్డ్.. ఏం జరిగిందంటే?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR)  దేవర (Devara)సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ తో సంచలనాలు సృష్టిస్తున్నారు. ఈ సినిమాకు పరిస్థితులు అనుకూలించడంతో ఓవర్సీస్ లో సైతం ఈ సినిమా సంచలనాలు సృష్టిస్తోంది. ప్రభాస్ (Prabhas) సలార్ (Salaar), కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD) సినిమాల ప్రీ సేల్స్ తో 2 మిలియన్ డాలర్ల మార్క్ ను అందుకోగా జూనియర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్  (RRR)  , దేవర సినిమాలతో 2 మిలియన్ డాలర్ల రికార్డును సొంతం చేసుకున్నారని తెలుస్తోంది. 2024 సంవత్సరం దేవర నామ సంవత్సరం అని అభిమానుల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

Devara

ఓవర్సీస్ లో ప్రత్యంగిరా సినిమాస్ ఈ సినిమాను రిలీజ్ చేస్తుండగా సులువుగా ఈ సినిమా అక్కడ బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉంది. చాలా కాలం తర్వాత తారక్ సోలో హీరోగా తెరకెక్కిన సినిమా కావడంతో తారక్ ఫ్యాన్స్ రికార్డ్ స్థాయి బుకింగ్స్ తో బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో కల్కి తర్వాత బుకింగ్స్ లో ఆ స్థాయి రెస్పాన్స్ వచ్చిన సినిమా దేవర అని చెప్పవచ్చు.

దేవర1 బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడం పక్కా అని దేవర2 పై అంచనాలు పెంచడం పక్కా అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సినిమా చూసిన తర్వాత కళ్ల ముందు వర పాత్ర మాత్రమే మెదులుతుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. దేవర పాత్ర ఎంత పవర్ ఫుల్ గా ఉంటుందో వర పాత్ర కూడా అంతే పవర్ ఫుల్ గా ఉంటుందని భోగట్టా. దేవర రిలీజ్ తో బాక్సాఫీస్ వద్ద డే1 కలెక్షన్లకు సంబంధించి కొత్త రికార్డులు క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంది.

బీ, సీ సెంటర్లలో సైతం దేవర సంచలనాలు మామూలుగా ఉండవని తెలుస్తోంది. దేవర సినిమాకు రివ్యూలు సైతం త్వరగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. దేవర పాత్రలో ఎన్టీఆర్ లుక్ మాత్రం వావ్ అనేలా ఉందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. నటుడిగా తారక్ దేవర సినిమాతో ఎన్నో మెట్లు పైకి ఎక్కుతారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

చిరంజీవితో విబేధాలపై కొరటాల రియాక్షన్ ఇదే.. ఏం చెప్పారంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus