Koratala Siva: చిరంజీవితో విబేధాలపై కొరటాల రియాక్షన్ ఇదే.. ఏం చెప్పారంటే?

చిరంజీవి  (Chiranjeevi) కొరటాల శివ (Koratala Siva)  కాంబినేషన్ లో తెరకెక్కిన ఆచార్య సినిమా ఒకింత భారీ అంచనాలతో విడుదలై అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే విషయంలో ఫెయిలైంది. కొన్నిరోజుల క్రితం కొరటాల శివ చేసిన కామెంట్లు చిరంజీవిని ఉద్దేశించి చేసిన కామెంట్లు అని ఫ్యాన్స్ భావించారు. అయితే మీడియాతో చిట్ చాట్ లో భాగంగా కొరటాల శివ కీలక విషయాలను వెల్లడించగా ఆ విషయాలు వైరల్ అవుతున్నాయి. ఆచార్య (Acharya)  సినిమా ఫ్లాప్ రిజల్ట్ ను అందుకున్న తర్వాత నాకు మొదట మెసేజ్ చేసిన వ్యక్తి చిరంజీవి అని కొరటాల అన్నారు.

Koratala Siva

చిరంజీవి కొన్ని ఇంటర్వ్యూలలో మాట్లాడిన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని ఆయన చెప్పుకొచ్చారు. మా మధ్య మంచి అనుబంధం ఉందంటూ కొరటాల శివ వెల్లడించడం గమనార్హం. మా మధ్య ఎలాంటి విబేధాలు లేవని చిరంజీవికి నాకు మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. మరోవైపు దేవర (Devara) మూవీ కథ బన్నీ  (Allu Arjun)  రిజెక్ట్ చేసిన కథ అని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తుండగా బన్నీకి చెప్పిన కథ వేరని దేవర మూవీ కథ వేరని తెలిపారు.

దేవర సినిమా కథ విషయంలో ప్రేక్షకుల్లో నెలకొన్న సందేహాలకు కొరటాల శివ ఈ విధంగా చెక్ పెట్టారు. వాస్తవానికి యువసుధ ఆర్ట్స్ బన్నీ కొరటాల శివ కాంబో ప్రాజెక్ట్ ను నిర్మించాల్సి ఉన్నా వేర్వేరు కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లలేదు. బన్నీ కొరటాల శివ కాంబోలో రాబోయే రోజుల్లో సినిమా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని సమాచారం అందుతోంది.

కొరటాల శివ భవిష్యత్తు సినిమాలకు సంబంధించి త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కొరటాల శివకు క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండగా దేవర సంచలన విజయాన్ని సొంతం చేసుకుంటే మాత్రం అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు.

13 ఏళ్ళ ‘దూకుడు’ గురించి ఈ సీక్రెట్ మీకు తెలుసా.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus