Adipurush: ప్రభాస్ ఆదిపురుష్ కు మళ్లీ ఇబ్బందేనా?

ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ఆదిపురుష్ మూవీ ఈ ఏడాది జూన్ నెలలో థియేటర్లలో రిలీజ్ కానుండగా ఈ సినిమా టీజర్ పై నెగిటివ్ కామెంట్లు వినిపించడంతో ఫ్యాన్స్ సైతం ఫీలయ్యారు. అయితే ఈ సినిమా ఎన్ని రిలీజ్ డేట్లను మార్చుకుంటున్నా ఈ సినిమాకు ఇబ్బందులు మాత్రం తప్పడం లేదు. ఈసారి ఆదిపురుష్ సినిమాకు మరో షాక్ తగులుతోందని తెలుస్తోంది. హాలీవుడ్ మూవీ నుంచి ఈసారి ఆదిపురుష్ కు గండం ఎదురవుతోందని సమాచారం.

హలీవుడ్ మూవీ ది ఫ్లాష్ అదే రోజు షెడ్యూల్ కావడంతో ప్రభాస్ అభిమానులకు టెన్షన్ మొదలైంది. ఎలాంటి పోటీ లేకుండా ఆదిపురుష్ మూవీ విడుదలైతే ప్రభాస్ కు సోలో హీరోగా రికార్డ్ స్థాయిలో కలెక్షన్లు వస్తాయని ఫ్యాన్స్ భావించారు. ఆదిపురుష్ మూవీ 500 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కగా ఆ రేంజ్ లో ఈ సినిమా రికవరీ సాధించడం సులువైన విషయం కాదనే సంగతి తెలిసిందే. నెగిటివిటీని తట్టుకుని ఈ సినిమా రికార్డులు చేయాలంటే మాత్రం సులువు కాదనే సంగతి తెలిసిందే.

హాలీవుడ్ సినిమాతో పోటీ అంటే ఆదిపురుష్ తీవ్రస్థాయిలో నష్టపోయే ఛాన్స్ ఉంది. ఈ సినిమాపై పెద్దగా అంచనాలు లేకపోయినా ప్రభాస్ నటించిన ఇతర సినిమాలపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొనడం గమనార్హం. ప్రభాస్ రెమ్యునరేషన్ ప్రస్తుతం 100 నుంచి 150 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. ఈ ఏడాది ప్రభాస్ నటించిన రెండు సినిమాలు రిలీజ్ కానుండగా

వచ్చే ఏడాది ప్రభాస్ నటించిన మూడు సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రభాస్ కు సినిమాల ద్వారా 700 కోట్ల రూపాయల రేంజ్ రెమ్యునరేషన్ దక్కుతుండగా ఆయన సినిమాల బడ్జెట్ 3000 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం కావడం గమనార్హం. భిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ ప్రభాస్ కెరీర్ ను కొనసాగిస్తున్నారు.



అమిగోస్ సినిమా రివ్యూ & రేటింగ్!
పాప్ కార్న్ సినిమా రివ్యూ & రేటింగ్!

వేద సినిమా రివ్యూ & రేటింగ్!
యూ.ఎస్ లో టాప్ గ్రాసర్స్ గా నిలిచిన 10 టాలీవుడ్ సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus