Mahesh Babu, Trivikram: మహేష్ త్రివిక్రమ్ మూవీ రిలీజ్ డేట్ ఇదేనా?

మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ సినిమా కొరకు మహేష్ అభిమానులతో పాటు త్రివిక్రమ్ అభిమానులు కూడా ఎదురుచూస్తున్నారు. త్రివిక్రమ్ డైరెక్షన్ లో తెరకెక్కి 2020 సంవత్సరంలో అల వైకుంఠపురములో సినిమా రిలీజైన తర్వాత ఈ డైరెక్టర్ డైరెక్షన్ లో మరో సినిమా తెరకెక్కలేదు. మార్చి లేదా ఏప్రిల్ నెలలో మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీ సెట్స్ పైకి వెళ్లనుండగా ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజయ్యే ఛాన్స్ ఉంది.

ఈ ఏడాది దసరాకే ఈ సినిమాను విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నా పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ఆ తేదీకి ఈ సినిమా రిలీజయ్యే ఛాన్స్ లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. మహేష్ సినిమా స్క్రిప్ట్ పనులను త్రివిక్రమ్ శ్రీనివాస్ పూర్తి చేశారు. త్రివిక్రమ్ కథనం, మాటలు అందించిన భీమ్లా నాయక్ వచ్చే నెల 25వ తేదీన రిలీజ్ కానుంది. శివరాత్రి కానుకగా రికార్డు స్థాయి థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.

మహేష్ సర్కారు వారి పాట సినిమాతో బిజీగా ఉండటం కూడా మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీ ఆలస్యం కావడానికి కారణమని సమాచారం. త్రివిక్రమ్ సినిమా ఏకంగా మూడేళ్లు ఆలస్యంగా రిలీజ్ కానుండటంతో త్రివిక్రమ్ అభిమానులు సైతం ఫీలవుతున్నారు. మహేష్ నటిస్తున్న సర్కారు వారి పాట ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీన రిలీజ్ కానుంది. ప్రస్తుతం మహేష్ లేని సీన్లను దర్శకుడు షూట్ చేస్తున్నారని సమాచారం. గీతా గోవిందం సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ సాధించిన పరశురామ్ ఈ సినిమాతో ఆ సినిమాను మించిన సక్సెస్ సాధిస్తానని కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.

మైత్రీ మూవీ మేకర్స్ ఖర్చు విషయంలో ఏ మాత్రం రాజీ పడకుండా నిర్మిస్తున్న సర్కారు వారి పాట బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది. మహేష్ రాజమౌళి కాంబినేషన్ సినిమా కూడా ఈ ఏడాదే మొదలయ్యే ఛాన్స్ ఉంది. ఈ సినిమా 600 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కనుందని తెలుస్తోంది. మహేష్ త్రివిక్రమ్ మూవీ ఈ ఏడాది రిలీజవుతుందని భావించిన ఫ్యాన్స్ కు త్రివిక్రమ్ షాకిచ్చారని చెప్పాలి.

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus