Jr NTR,Prashanth Neel: దేశాల లెక్కతోనే షాకిచ్చిన ప్రశాంత్ నీల్.. ఏం జరిగిందంటే?

స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సినిమాలకు సంబంధించి ఎలాంటి అప్ డేట్ ఇచ్చినా ఆ అప్ డేట్ క్షణాల్లో వైరల్ అవుతుంది. సలార్ సినిమా ప్రమోషన్స్ లో లో భాగంగా ఎన్టీఆర్ ప్రశాంత్ కాంబో మూవీకి సంబంధించి ఆసక్తికర అప్ డేట్ వచ్చింది. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ షూట్ ఏకంగా 38కు పైగా దేశాల్లో జరగనుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. దేశాల లెక్కతోనే ప్రశాంత్ నీల్ షాకిచ్చారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అన్ని దేశాల్లో షూట్ చేయడం అంటే కూడా ఒక విధంగా రికార్డ్ అనే చెప్పాలి. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఎంత బడ్జెట్ తో సినిమాను నిర్మించినా ఈ మూవీ నిరాశపరిచే ఛాన్స్ ఉండదని బడ్జెట్ కు రెట్టింపు స్థాయిలో బిజినెస్ జరగడం ఖాయమని తెలుస్తోంది. 400 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కుతోందని ప్రాథమికంగా తెలుస్తోంది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ప్రశాంత్ నీల్ అభిమాని కాగా తారక్ ను ప్రశాంత్ నీల్ ఏ విధంగా చూపిస్తారో అని అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. ప్రశాంత్ నీల్ గత సినిమాలను మించి ఈ సినిమా ఉండనుందని తెలుస్తోంది. ఈ సినిమాతో తారక్ గ్లోబల్ ఇమేజ్ మరింత పెరగడం ఖాయమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమా కథ, కథనం సరికొత్తగా ఉండనున్నాయని ప్రశాంత్ నీల్ గత సినిమాలకు భిన్నంగా ఈ మూవీ ఉండనుందని తెలుస్తోంది.

ప్రశాంత్ నీల్ (Prashanth Neel) రెమ్యునరేషన్ ప్రస్తుతం 50 నుంచి 70 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. తారక్ ప్రశాంత్ కాంబో మూవీ రెమ్యునరేషన్ల కోసమే 200 కోట్ల రూపాయల రేంజ్ లో ఉండనుందని సమాచారం అందుతోంది. తారక్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ 2026 సంవత్సరంలో విడుదలయ్యే ఛాన్స్ అయితే ఉందని సమాచారం అందుతోంది. ఈ సినిమాకు సంబంధించి త్వరలో మరిన్ని అప్ డేట్స్ రానున్నాయని సమాచారం అందుతోంది.

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus