Jr NTR, Prashanth Neel: ప్రశాంత్ నీల్ డ్రీమ్ ప్రాజెక్ట్ గా తారక్ మూవీ.. ఆ సినిమాలను మించేలా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ మూవీ సెట్స్ పైకి వెళ్లకుండానే సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. మైత్రీ నిర్మాతలు నిర్మిస్తున్న ఈ సినిమాకు షూటింగ్ మొదలుకాకుండానే భారీగా ఆఫర్లు వస్తున్నాయని తెలుస్తోంది. చెర్నోబిల్ న్యూక్లియర్ డిజాస్టర్ బ్యాక్ డ్రాప్ లో ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ తెరకెక్కనుందని తెలుస్తోంది. ప్రశాంత్ నీల్ డ్రీమ్ ప్రాజెక్ట్ గా ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం. ఓవర్సీస్ లోనే ఈ సినిమా షూటింగ్ ఎక్కువగా జరగనుండగా ఉక్రెయిన్ లోని కీవ్ ప్రాంతంలో జరిగిన న్యూక్లియర్ డిజాస్టర్ ను బేస్ చేసుకుని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది.

1986 సంవత్సరంలో ప్రపంచాన్ని కుదిపేసిన ఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుండటంతో అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. పాన్ వరల్డ్ మూవీగా ఈ సినిమా తెరకెక్కుతోందని కామెంట్లు వినిపిస్తున్నాయి. హాలీవుడ్ స్టైల్ మేకింగ్ తో ప్రశాంత్ నీల్ ఈ సినిమాను తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. కళ్లు చెదిరే విజువల్స్ తో ఈ సినిమా తెరకెక్కుతోందని సమాచారం అందుతోంది. సినిమా సినిమాకు భిన్నమైన బ్యాక్ డ్రాప్ లను ఎంచుకుంటున్న ప్రశాంత్ నీల్ ఒక సినిమాకు మరో సినిమాకు ఎలాంటి లింక్ లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

మైత్రీ నిర్మాతలు, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ నిర్మాతలు ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్ లో ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ వరుసగా భారీ సినిమాలలో నటిస్తుండగా ఈ సినిమాలన్నీ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ రెమ్యునరేషన్ భారీ స్థాయిలో ఉండగా కొన్ని సినిమాలకు మాత్రం తారక్ లాభాల్లో వాటా తీసుకుంటున్నారు.

ప్రస్తుతం నటిస్తున్న సినిమాలు పూర్తైన తర్వాతే జూనియర్ ఎన్టీఆర్ కొత్త సినిమాలకు సంబంధించిన ప్రకటనలు రానున్నాయని తెలుస్తోంది. (Jr NTR) తారక్ భవిష్యత్తు సినిమాలు సైతం భారీ స్థాయిలోనే ఉండనున్నాయని భోగట్టా.

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus