మహేష్ అభిమానులకు శుభవార్త. అనేక వాయిదాలు వేసుకుంటూ సాగుతున్న స్పైడర్ షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. ఒక్క పాట మాత్రమే మిగిలి ఉంది. గత నెల చెన్నై లో క్లైమాక్స్ షూటింగ్ తో టాకీ పార్టీ పూర్తి చేసుకున్న ఈ మూవీలో రెండు పాటల చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉన్నింది. ఈనెల ఐదవ తేదీ నుంచి స్పైడర్ లో మిగిలిఉన్న రెండు పాటల్లో ఒక పాట చిత్రీకరణ మొదలు పెట్టారు. అన్నపూర్ణ స్టూడియోలో వేసిన భారీ సెట్ లో మహేష్, రకుల్ పై పాటను కంప్లీట్ చేశారు. దీంతో ఇంకొక్క పాట మాత్రమే మిగిలి ఉంది. ఆ పాటను లండన్లో ప్లాన్ చేశారు. వచ్చేనెల రెండవ తేదీ నుంచి యూరప్ లోని అందమైన లొకేషన్లో మహేష్, రకుల్ పై డ్యూయెట్ తెరకెక్కించనున్నారు.
ఈ మూవీకి విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ రష్యా, చైనా తదితర దేశాల్లో జరుగుతోంది. ఠాగూర్ మధు సమర్పణలో ఎన్.వి.ఆర్. సినిమా, ఎల్ఎల్పి, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై ఎన్.వి.ప్రసాద్ నిర్మిస్తున్న స్పైడర్ మూవీ ట్రైలర్ మహేష్ బర్త్ డే ఆగస్టు 9 న రిలీజ్ చేయనున్నారు. ఇంటెలిజన్స్ ఆఫీసర్ గా మహేష్ కనిపించనున్న ఇందులో విలన్ గా ఎస్.జె.సూర్య నటిస్తున్నారు. హరీష్ జయరాజ్ సంగీతాన్ని అందిస్తున్న ఈ మూవీ సెప్టెంబర్ 27 న రిలీజ్ కానుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.