Nagarjuna: రియల్ స్టంట్స్ కోసం నాగ్ స్పెషల్ ట్రైనింగ్!

టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున నటించిన ‘వైల్డ్ డాగ్’ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ.. కలెక్షన్స్ మాత్రం ఆశించిన స్థాయిలో రాలేదు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం నాగ్.. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. ‘వైల్డ్ డాగ్’ సినిమాలో మాదిరి ఇందులో కూడా నాగ్ స్పెషల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. అయితే ఈ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని సమాచారం. ఈ సినిమా కోసం నాగార్జున రియల్ స్టంట్స్ చేయబోతున్నారు.

దీనికోసం కెరీర్ లో ఎన్నడూ లేని విధంగా ఓ కొత్త తరహా విదేశీ మార్షల్ ఆర్ట్స్ తో పాటు కత్తి యుద్ధం సైతం నేర్చుకుంటున్నారట. అయితే ప్రస్తుతం కోవిడ్ పరిస్థితుల్లో విదేశాల నుండి మాస్టర్ ను పిలిపించుకోవడం, లేదా నాగ్ అక్కడకు వెళ్లి ట్రైనింగ్ తీసుకోవడం లాంటి పనులు చేయలేని పరిస్థితి. అందుకే నాగ్ ఆన్ లైన్ క్లాసులను ఆశ్రయించారట. ఈ విషయాన్ని దర్శకుడు ప్రవీణ్ సత్తారు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

ఓ మార్షల్ ఆర్ట్స్ నిపుణుడి నుండి ఆన్ లైన్ క్లాసుల ద్వారా క్రవ్ మగా అనే యుద్ధ కళను నేర్చుకుంటున్నాడట నాగ్. ఆన్ లైన్ లో మాస్టర్ సూచనలు ఇస్తుంటే.. ఇక్కడ నాగ్ ఓ మార్షల్ ఆర్ట్స్ నిపుణుడి నేపథ్యంలో ట్రైన్ అవుతున్నాడట. దీంతో పాటు కటానా అనే కత్తి యుద్ధ కళను సైతం నేర్చుకుంటున్నాడట. మొత్తానికి నాగ్ తన రియల్ స్టంట్స్ తో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతున్నాడన్నమాట. ఈ సినిమాలో నాగ్ సరసన బాలీవుడ్ భామ గుల్ పనాగ్ నటించనుంది.

Most Recommended Video

‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus