Rajinikanth: రజనీకాంత్ గురించి ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?

కోలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలలో స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకున్న రజనీకాంత్ ప్రస్తుతం జైలర్ సినిమాలో నటిస్తున్నారు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈరోజు రజనీకాంత్ పుట్టినరోజు అనే సంగతి తెలిసిందే. అయితే రజనీకాంత్ అభిమానులకు ఆయనకు సంబంధించిన చాలా విషయాలు తెలియవు. నటుడిగా ఎన్నో సంచలనాలు సృష్టించిన రజనీకాంత్ రాజకీయాల్లో కూడా సంచలనాలు సృష్టిస్తారని ఫ్యాన్స్ భావించగా వేర్వేరు కారణాల వల్ల ఆయన పాలిటిక్స్ పై ఆసక్తి చూపలేదు.

160కు పైగా సినిమాలలో నటించిన రజనీకాంత్ తన సినీ కెరీర్ లో ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నారు. అయితే ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం రజనీకాంత్ ప్రత్యేకత అని చెప్పవచ్చు. తన సంపాదనలో 50 శాతం డబ్బును రజనీకాంత్ సేవా కార్యక్రమాల కోసం ఖర్చు చేస్తున్నారు. సీ.బీ.ఎస్.ఈ బుక్స్ లో చోటు సంపాదించుకున్న ఏకైక భారతీయ నటుడు రజనీకాంత్ అనే సంగతి తెలిసిందే. ఈ గుర్తింపు రజనీకాంత్ కు మాత్రమే ఉండటంతో ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు.

ఫ్రమ్ బస్ కండక్టర్ టు సూపర్ స్టార్ అనే పేరుతో ఈ పాఠం ఉంది. ప్రముఖ నటి మనోరమ ఒక సందర్భంలో తనపై విమర్శలు చేసినా రజనీకాంత్ ఆమెకు తన సినిమాలలో ఛాన్స్ ఇవ్వడం గమనార్హం. చిన్న నటులు అయినా పెద్ద నటులు అయినా గౌరవం ఇచ్చే విషయంలో రజనీకాంత్ ముందువరసలో ఉండేవారు. పైపై మెరుగులకు రజనీకాంత్ ప్రాధాన్యత ఇవ్వరు. జైలర్ సినిమాతో రజనీకాంత్ సక్సెస్ ట్రాక్ లోకి వస్తానని కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.

కెరీర్ తొలినాళ్లలో రజనీకాంత్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలలో నటించి మెప్పించారు. తన స్టైల్ తో రజనీకాంత్ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకోవడంతో పాటు ఫ్యాన్స్ కు మరింత దగ్గరయ్యారు.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus