కన్నడ చలన చిత్ర పరిశ్రమలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు మరియు ఇండస్ట్రీ హిట్ సినిమాలు వచ్చి ఉండొచ్చు. కానీ ఉపేంద్ర దర్శకత్వం లో వచ్చిన ‘ఓం’ చిత్రం మాత్రం ఒక చరిత్ర అనే చెప్పాలి. ఈ సినిమాని ఇప్పటి వరకు 550 సార్లు రీ రిలీజ్ చేసారు.ఇది ఒక అరుదైన రికార్డుగా గుర్తించి లింకా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానాన్ని కల్పించారు.ఈ చిత్రం లో కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్ నటించాడు.
ఆ రోజుల్లో ఈ చిత్రాన్ని కేవలం 70 లక్షల రూపాయిల బడ్జెట్ తో తెరకెక్కించాడు. ఈ సినిమాకి కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కర్ణాటక ప్రాంతానికి డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించాడు.అంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఈ చిత్రం విడుదలై నేటి 28 ఏళ్ళు పూర్తి అయ్యింది. ఈ సందర్భంగా ఈ చిత్రం గురించి ఎవరికీ తెలియని కొన్ని ఆసక్తి కరమైన విషయాలను మీ ముందు ఉంచబోతున్నాము.
ఈ చిత్రం కోసం (Upendra) ఉపేంద్ర ఎవ్వరు ఆలోచించని విధంగా జైలు లో ఏళ్ళ తరబడి మగ్గుతున్న కొంతమంది నిజమైన అండర్ వరల్డ్ డాన్స్ ని తీసుకొచ్చి ఈ చిత్రం లో నటింపచేసాడు. లోకల్ గా ఉండే కొంత మంది రౌడీ షీటర్స్ ని కూడా ఆయన తీసుకొచ్చాడు.అప్పట్లో ఇది పెద్ద సంచలనంగా మారింది.
దీనిని అనుమతించినందుకు గాను అప్పట్లో ‘ది వీక్లీ మ్యాగజైన్’ వాళ్ళు శివ రాజ్ కుమార్ తో ఇక ఎవరూ నటించకూడదు అంటూ ఒక కథనం కూడా ప్రచురితం చేసింది. అలాంటి సెన్సషనల్ బ్లాక్ బస్టర్ ని ఉపేంద్ర తెలుగు లో యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజ్ శేఖర్ ని పెట్టి ‘ఓంకార’ అని రీమేక్ చేసాడు. కన్నడ లో ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో, తెలుగు లో అంత పెద్ద డిజాస్టర్ గా మిగిలింది.