“క్రెడిట్” నాగార్జునదే

సరికొత్త కధాంశాలకి ప్రాణం పోస్తూ, డిఫరెంట్ మూవీస్ కు కేర్ ఆఫ్ అడ్రెస్ అయిన నాగార్జున తాజాగా నటించిన సినిమా ‘ఊపిరి’. మనం లాంటి భారీ విజయం తరువాత, నాగార్జున చేసిన సొగ్గాడే కూడా మంచి హిట్ టాక్ ను సంపాదించుకుంది. ఇదిలా ఉంటే తాజాగా మరొక ప్రయోగానికి శ్రీకారం చుట్టిన నాగార్జున ‘ఊపిరి’గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమా ఈరోజే విడుదలయ్యి మంచి టాక్ ను సంపాదించుకున్న క్రమంలో ఈ సినిమా సక్సెస్ లో నాగ్ పాత్ర పై సర్వత్రా చర్చ మొదలయింది. విషయం ఏమిటంటే…ఈ సినిమా విషయంలో నాగ్ ముందు నుంచి జాగ్రత్త పడుతూనే ఉన్నాడు. ఈ సినిమాలో నాగ్ పాత్ర చాలా డిఫరెంట్ పాత్ర కావడం, ఇక ఆ పాత్రను హైలైట్ చేస్తూనే సినిమాకు సరికొత్త పద్దతిలో పబ్లిసిటీ ఇచ్చాడు. తన పాత్ర ఇది అని ముందే చెప్పేసిన నాగ్ ట్రైలర్, టీజర్ లో తన క్యారక్టర్ లక్షణాలను ప్రేక్షకులు రిజిస్టర్ చేసుకునేలా చేశాడు. ఇది ఓ రకంగా ముందు సినిమాలో ఏవేవి అంశాలు ఉన్నాయని చెప్పే ప్రయోగం అన్నమాట. అందుకే దాదాపుగా ఈ సినిమాను తన సొంత సినిమాలాగా భుజాలపై వేసుకుని మరీ పబ్లిసిటీ ఇచ్చాడు. ఇక నాగ్ ఇచ్చిన పబ్లిసిటీ, తాను నటించిన సరికొత్త క్యారెక్టర్, కార్తి, తమన్నా పాత్రలు ఈ సినిమాకు హైలైట్ అనే చెప్పాలి. మరి ఈ సినిమా నాగ్ ‘మనం’ లాగా భారీ ప్రభంజనం అవుతుందో, లేదంటే రొటీన్ సినిమాలాగా రెండు, మూడు వారాలకే ప్యాక్ అప్ చెబుతుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus