తెలుగు హీరోలు ప్రయోగాలు చేయరా..? మన దగ్గర కొత్త కథాంశాలతో సినిమాలు రావా..? సందేశాత్మక కథలో వినోదం మేళవించి ఆసక్తికరంగా తీయడం కుదరదా..? ఇటువంటి ప్రశ్నలకు సమాధానమే ‘ఊపిరి’. అక్కినేని నాగార్జున, కార్తీ, తమన్నా నటీనటులుగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో పివిపి సంస్థ నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలైంది. ఎలా ఉందో? రివ్యూ చదివి తెలుసుకోండి.
కథ :
శీను (కార్తీ) జైలు నుంచి పెరోల్ మీద బయటకొచ్చిన దొంగ. విక్రమాదిత్య (నాగార్జున).. తరగని ఆస్థి అతడి సొంతం. ఓ ప్రమాదంలో కాళ్ళు .. చేతులు.. చచ్చుబడిపోతాయి. ప్రతి ఒక్కరూ అతడిపై సానుభూతి, జాలి చూపిస్తారు. అటువంటి లక్షణాలు లేని శీనుని తన బాధ్యతలు నిర్వర్తించే వ్యక్తి (కేర్ టేకర్) గా నియమించుకుంటాడు. విక్రమాదిత్య పిఏ కీర్తి (తమన్నా) కు శీను లైన్ వేస్తుంటాడు. శీను ఉద్యోగంలో చేరిన తర్వాత విక్రమాదిత్య జీవితంలో చోటు చేసుకున్న మార్పులు ఏమిటి? విక్రమాదిత్య నుంచి శీను ఏం నేర్చుకున్నాడు? ప్రపంచంలో నిజమైన సంతోషం ఎక్కడ ఉంది? డబ్బుతో సంతోషం వస్తుందా? శీను ప్రేమ సంగతి ఏమైంది? ఇటువంటి ప్రశ్నలకు సమాధానమే ‘ఊపిరి’ చిత్రం.