అసలు ఎవరు ఈ ‘జితేందర్ రెడ్డి’ ఏముంది ఆయన గురించి తెలుసుకోవడానికి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఉయ్యాల జంపాల, మజ్ను లాంటి ప్రేమ కథలను దర్శకత్వం వహించిన విరించి వర్మ దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘జితేందర్ రెడ్డి’. రీసెంట్ గా వచ్చిన పోస్టర్ సినిమా పైన ఆసక్తి పెంచగ ఇవాళ విడుదలైన ‘జితేందర్ రెడ్డి’ ఇచ్చిన హామీ వీడియో అసలు ఎవరు ఈ ‘జితేందర్ రెడ్డి’ అని తీసుకోవాలనె అంచనాలను పెంచేసింది. ‘జితేందర్ రెడ్డి’ అనే నేను అంటూ ఆయన చేసిన హామి అలానే ఆ వీడియో లో చూపించిన ‘ధీరుడు ఒకసారె మరణిస్తాడు కాని పిరికివాడు క్షణక్షణం మరణిస్తాడు’ అన్న మాట ఆలోచింపచేసే విధంగా ఉంది.
కాగా ఈ సినిమా లో ‘జితేందర్ రెడ్డి’ గా చేసింది ఎవరు అని తెలుసుకోవాలంటే ఈ నెల 21 న ఫస్ట్ లుక్ విడుదల చేస్తున్నారు టీం. వి.ఎస్ జ్ఞాన శేఖర్ కెమెరామెన్ పని చేస్తున్నారు. ఎన్నో సూపర్‌హిట్ చిత్రాలకు సంగీతం అందించిన మలయాళ సంగీత దర్శకుడు గోపీసుందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. నాగేంద్రకుమార్ ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ముదుగంటి క్రియేషన్స్ బ్యానర్‌పై ముదుగంటి రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.