Orange Collections: రీ రిలీజ్ లో మాత్రం సూపర్ హిట్ అయిన ‘ఆరెంజ్’..!

రాంచరణ్ నటించిన ‘ఆరెంజ్’ ఇటీవల రీ రిలీజ్ అయ్యింది. 2010 లో వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే. అయితే రీ -రిలీజ్లో మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. నాగ బాబు నిర్మించిన ఈ సినిమా అప్పుడు భారీ నష్టాలను మిగిల్చింది. కానీ రీ రిలీజ్ లో బాగా కలెక్ట్ చేసింది. రీ రిలీజ్ లో ‘ఆరెంజ్’ కలెక్ట్ చేసిన అమౌంట్ ను పవన్ కళ్యాణ్ జనసేనకి పార్టీ ఫండ్ గా ఇస్తామని నాగబాబు చెప్పారు.

చెప్పినట్టే కలిసి ఈ అమౌంట్ ను అందజేశారు. రీ రిలీజ్ లో ఆరెంజ్ ఎంత వరకు కలెక్ట్ చేసిందో ఇప్పుడు ఓ లుక్కేద్దాం రండి :

నైజాం 0.43 cr
సీడెడ్ 0.16 cr
ఆంధ్ర 0.36 cr
ఏపీ + తెలంగాణ 0.95 cr (షేర్)
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 0.10 cr
వరల్డ్ వైడ్ టోటల్ 1.105 cr (షేర్)

‘ఆరెంజ్’ (Orange) చిత్రం రూ.1.05 కోట్ల షేర్ ను రీ రిలీజ్ లో కలెక్ట్ చేసింది. గ్రాస్ పరంగా ఈ చిత్రం రూ.2.5 కోట్ల పైనే కలెక్ట్ చేసింది. కానీ థియేటర్ల రెంట్ లు, జీఎస్టీ లు వంటివి తీసేయగా.. వచ్చిన మొత్తాన్ని ‘జనసేన’ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు నాగబాబు మరియు రాంచరణ్ ఫ్యాన్స్ కలిసి అందజేశారు.

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus