Ori Devuda Collections: రెండో వీకెండ్ కూడా పర్వాలేదు అనిపించింది..!

విశ్వక్ సేన్ హీరోగా మిథిలా పాల్కర్, ఆశా భట్ హీరో హీరోయిన్లుగా రూపొందిన తాజా చిత్రం ‘ఓరి దేవుడా’. తమిళంలో సూపర్ హిట్ అయిన ‘ఓ మై కడవలె’ కి రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కింది. ‘పి వి పి’ బ్యానర్ పై ప్రసాద్ వి. పొట్లూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. అశ్వ‌త్ మారి ముత్తు దర్శకుడు. స్టార్ హీరో వెంకటేష్ ఈ మూవీలో దేవుడు పాత్రలో కనిపించడం విశేషంగా చెప్పుకోవాలి. ఈ చిత్రం దీపావ‌ళి కానుకగా అక్టోబ‌ర్ 21న విడుద‌ల అయ్యింది.

మొదటి రోజు పాజిటివ్ టాక్ ను రాబట్టుకున్న స్టడీ రన్ ను కొనసాగిస్తుంది.మొదటి వారం పర్వాలేదు అనిపించిన ఈ మూవీ రెండో వీకెండ్ కు కూడా పర్వాలేదు అనిపించింది. ఒకసారి 10 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 1.85 cr
సీడెడ్ 0.49 cr
ఉత్తరాంధ్ర 0.68 cr
ఈస్ట్ 0.26 cr
వెస్ట్ 0.22 cr
గుంటూరు 0.34 cr
కృష్ణా 0.41 cr
నెల్లూరు 0.17 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 4.42 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా +
ఓవర్సీస్
0.72 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 5.14 cr (షేర్)

‘ఓరి దేవుడా’ చిత్రానికి రూ.5.3 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.5.6 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. టాక్ పాజిటివ్ గా వచ్చినా, ఈ చిత్రంలో వెంకటేష్ వంటి స్టార్ హీరో నటించినా 10 రోజులు పూర్తయ్యేసరికి కేవలం రూ.5.14 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది.

బ్రేక్ ఈవెన్ కు ఈ మూవీ ఇంకా రూ.0.46 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. మరి ఈ వీకెండ్ కూడా డీసెంట్ గా రాణించి ఆ ఫీట్ ను సాధిస్తుందో లేదో చూడాలి.

‘ఆర్.ఆర్.ఆర్’ టు ‘కార్తికేయ’ టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు..!

Most Recommended Video

‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus