బ్యాడ్ మూమెంట్ ఆఫ్ ఆస్కార్ 2022గా నిలిచిన విల్ స్మిత్ చెంపదెబ్బ ఇష్యూ ఇక్కడితో ఆగిపోయేలా లేదు. ఇప్పటికే ఈ విషయంలో విల్ స్మిత్ బహిరంగ క్షమాపణలు చెప్పినా AMPAS మాత్రం ఇక్కడితో దీనిని విడిచి పెట్టాలని అనుకోవడం లేదు. ఈ మేరకు AMPAS అధ్యక్షుడు అస్కార్స్ (అకాడమీ)కి లేఖ రాశారు. విల్ స్మిత్ వ్యవహారంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ అంశంలో విల్ స్మిత్‌పై తగు చర్యలు తీసుకోవాలని అందులో కోరినట్లు సమాచారం.
ఇటీవల జరిగిన ఆస్కార్స్ వేడుకలో వ్యాఖ్యత అయితన ప్రముఖ కమెడియన్ క్రిస్ రాక్‌పై ఆస్కార్ విజేత విల్ స్మిత్ చేయిచేసుకున్న విషయం తెలిసిందే. వీక్షకులు, ప్రేక్షకులు, నిర్వాహకులను షాక్‌కు గురి చేసిన ఈ ఘటనపై ఆస్కార్ అకాడమీ తీవ్ర అసంతృప్తి, ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే విల్ స్మిత్‌పై చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ (AMPAS) అధ్యక్షుడు డేవిడ్ రూబిన్ అకాడమీ సభ్యులకు ఓ లేఖ పంపారు. చెంప దెబ్బ ఘటనపై అకాడమీ చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు.
94వ ఆస్కార్ వేడుకలలో ఓ నామినీ ఆమోదయోగ్యం కాని, హానికర ప్రవర్తనతో మేం కలత చెందాం. విల్ స్మిత్ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయన క్రిస్ రాక్ విషయంలో హద్దు మీరారు. నియమ నిబంధనల్లో భాగంగా అకాడమీ గవర్నర్ల బోర్డు విల్ స్మిత్‌పై తగిన చర్యలు తీసుకోవాలి అని అధ్యక్షుడు డేవిడ్ రూబిన్ ఆ లేఖలో రాసుకొచ్చారు.
ఇంతకీ ఏమైందంటే…
ఆస్కార్ అవార్డుల కార్యక్రమంలో భాగంగా వీక్షకుల్ని నవ్వించేందుకు ఓ కామెడీ ట్రాక్‌ను చెప్పుకొచ్చాడు క్రిస్ రాక్. ఈ క్రమంలో విల్ స్మిత్ సతీమణి జాడా పింకెట్ ప్రస్తావన తీసుకొచ్చాడు. జుట్టు పూర్తిగా తొలగించుకొని వేడుకకు హాజరైన జాడాను ‘జీ.ఐ.జేన్’ చిత్రంలో డెమి మూర్ పాత్రతో పోల్చారు. మీరు ‘జీ.ఐ.జేన్’ సీక్వెల్‌లో కనిపించబోతున్నారా? అంటూ హాస్యాన్ని పండించే ప్రయత్నం చేశారు. అయితే జాడా అలోపేసియా అనే అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్యతో బాధపడుతున్న వారిలో జుట్టు ఊడిపోతుంటుంది.
ఈ విషయం తెలిసో తెలియక క్రిస్ రాక్ జోక్ చేయడంతో.. విల్ స్మిత్ నేరుగా వేదిపైకి వెళ్లి క్రిస్ చెంప ఛెళ్లుమనిపించాడు. అయితే ఆ తర్వాత విల్ స్మిత్ వేదికపైకి వచ్చి జరిగిన ఘటనపై స్పందిస్తూ అకాడమీ, సహచర నామినీలకు క్షమాపణలు చెప్పాడు. అంతేకాదు ఇన్‌స్టాగ్రామ్‌లో మరోసారి క్షమాపణలు తెలిపారు. కానీ ఏఎంపీఏఎస్.. విల్ స్మిత్ ప్రవర్తను సహించడం లేదని అధ్యక్షుడి లేఖతో అర్థమవుతోంది.
Most Recommended Video
‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?