Tollywood: టాలీవుడ్ నిర్మాతలకు ఓటీటీ డీల్స్ గిట్టుబాటు కావా?

  • May 15, 2022 / 05:50 PM IST

టాలీవుడ్ పెద్ద సినిమాల నిర్మాతలకు గత రెండేళ్లలో ప్రముఖ ఓటీటీ సంస్థలు ఇస్తున్న ఆఫర్లు వరంగా మారాయి. భారీ బడ్జెట్ సినిమాల హక్కులను అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్, జీ5 భారీ మొత్తానికి కొనుగోలు చేస్తున్నాయి. అయితే ఈ మధ్య కాలంలో పెద్ద సినిమాల ఫలితాలు భారీ షాక్ ఇస్తుండటంతో ఓటీటీ సంస్థలు ఇకపై తక్కువ మొత్తానికే ఓటీటీ హక్కులను కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

ప్రముఖ ఓటీటీ సంస్థలు సినిమాలను కొనుగోలు చేయడానికి సంబంధించిన బడ్జెట్ ను భారీగా తగ్గించాయని ప్రచారం జరుగుతుండటం గమనార్హం. అమెజాన్ ప్రైమ్ ఇప్పటివరకు కొనుగోలు చేసిన పెద్ద సినిమాలలో చాలా సినిమాలు నిరాశపరిచాయి. అమెజాన్ ప్రైమ్ ఇకపై పెద్ద సినిమాలను కొనుగోలు చేసే విషయంలో ఆచితూచి వ్యవహరించనుందని సమాచారం అందుతోంది. నెట్ ఫ్లిక్స్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ గతంతో పోల్చి చూస్తే కంటెంట్ల బడ్జెట్లను తగ్గించాయని బోగట్టా.

సోనీ లివ్, జీ5 కూడా మోడల్స్ ను మార్చుకున్నాయని వెబ్ సిరీస్ లపై, రీజనల్ కంటెంట్ పై ఈ సంస్థలు ఎక్కువగా దృష్టి పెట్టాయని తెలుస్తోంది. రాబోయే రోజుల్లో పెద్ద సినిమాల ఓటీటీ డీల్స్ విలువ భారీగా తగ్గే ఛాన్స్ అయితే ఉంది. సబ్ స్క్రైబర్ల సంఖ్య అంతకంతకూ తగ్గుతుండటం కూడా ఓటీటీ డీల్స్ విషయంలో ప్రముఖ సంస్థలు వెనుకడుగు వేయడానికి కారణం అని తెలుస్తోంది. చిన్న సినిమాలను కొనుగోలు చేయడానికి ప్రముఖ సంస్థలు ఆసక్తి చూపించడం లేదు.

ఒకవేళ కొనుగోలు చేసినా పే పర్ వ్యూ పద్ధతిలో డబ్బులు చెల్లిస్తున్నాయి. ఈ విధానం వల్ల చిన్న సినిమాల నిర్మాతలకు పెద్దగా లాభం రావడం లేదని బోగట్టా. ఓటీటీలలో తక్కువ సమయంలోనే పెద్ద సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్న నేపథ్యంలో థియేటర్లలో ఫ్యామిలీతో కలిసి సినిమాలను చూసే ప్రేక్షకుల సంఖ్య అంతకంతకూ తగ్గుతోంది.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

మహేష్ బాబు 26 సినిమాలు.. మరియు వాటి బాక్సాఫీస్ కలెక్షన్లు..!
‘భద్ర’ టు ‘అఖండ’.. బోయపాటి డైరెక్ట్ చేసిన సినిమాల కలెక్షన్లు..!
‘దూకుడు’ టు ‘సర్కారు వారి పాట’.. ఓవర్సీస్ లో మహేష్ బాబు 1 మిలియన్ మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus