కోవిడ్ టైంలో ఓటీటీ సంస్థలు షూటింగ్ పూర్తి చేసుకుని, రిలీజ్ కు దగ్గరగా ఉన్న సినిమాలను నేరుగా స్ట్రీమింగ్ చేయడానికి రెడీ అయ్యాయి. అందుకు కోట్లకు కోట్లు.. నిర్మాతలకు చెల్లించడం కూడా జరిగింది. పెద్ద సినిమాలు సైతం ఓటీటీల్లో రిలీజ్ అవ్వడం చూశాం. కానీ ఓటీటీలకు ఇస్తే.. మేకర్స్ ఆ సినిమాని సరిగ్గా ప్రమోట్ చేయడం లేదు అని భావించి…, తర్వాత ఓటీటీ సంస్థలు మనసు మార్చుకున్నాయి. సినిమాని మొదట థియేట్రికల్ రిలీజ్ చేస్తే..
రిలీజ్ ముందు అడిగినంత డబ్బు ఇస్తామని నిర్మాతలకు చెప్పాయి. ఇప్పటి వరకు అదే పద్ధతి అమల్లో ఉంది. దీంతో రిలీజ్ అయిన 2 వారాలకు, వారానికి సినిమాలు ఓటీటీకి వచ్చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఓ సినిమా రేపు థియేటర్లలో రిలీజ్ అనగా.., అర్దాంతరంగా ఆపేసి ఓటీటీకి తీసుకురావడం చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే… ‘భూల్ చక్ మాఫ్’ (Bhool Chuk Maaf) అనే హిందీ సినిమా థియేటర్లలో రిలీజ్ కావాల్సి ఉంది.
మే 9న రిలీజ్ అని మేకర్స్ ప్రకటించారు కూడా. అయితే ప్రస్తుతం పాకిస్తాన్ ఉగ్రవాద దాడి నేపథ్యంలో సెక్యూరిటీ డ్రిల్స్ వంటివి నడుస్తున్నందున.. ప్రజల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని మే 16న ఈ సినిమాను డైరెక్ట్ గా అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
అయితే ‘భూల్ చక్ మాఫ్’ (Bhool Chuk Maaf) సినిమా ఇప్పటికే 2 సార్లు పోస్ట్ పోన్ అయ్యింది. మే 9న రిలీజ్ అని 2,3 రోజుల ముందు బుకింగ్స్ ఓపెన్ చేసినా.. మొత్తం కలిపి కనీసం 10 శాతం బుకింగ్స్ కూడా జరగలేదు. అందుకే మేకర్స్ ‘సెక్యూరిటీ డ్రిల్ అంశాన్ని అడ్డం పెట్టుకుని ఓటీటీకి ఇచ్చేస్తున్నారు’ అనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.