హీరోలు చాలా వరకు షర్ట్ లెస్ గా కనిపించిన సినిమాలు ఉన్నాయి. సినిమాల్లో పలు కీలక సన్నివేశాల్లో షర్ట్ లేకుండా హీరోలు కనిపించిన సందర్భాలు ఉన్నాయి. ఒకప్పుడు స్టార్ హీరోలు గ్యాప్ లేకుండా సినిమాలు చేసేవారు. అందువల్ల ఫిజిక్ పై పెద్దగా దృష్టి పెట్టేవారు కాదు. చిరు (Chiranjeevi), బాలయ్య (Nandamuri Balakrishna), వెంకటేష్ (Venkatesh Daggubati), నాగార్జున (Nagarjuna) వంటి స్టార్ హీరోలు… ఒక్క నాగార్జున మాత్రమే ఫిట్నెస్ మెయింటైన్ చేస్తూ వచ్చారు… వస్తున్నారు కూడా. కానీ ఇప్పటి జనరేషన్ హీరోల్లో చాలా మంది ఏడాదికి ఒకటి, రెండు సినిమాలే చేసేది.
గట్టిగా ఒక సినిమా రావడం కూడా కష్టంగా ఉంది. అందుకే ఎక్కువ సమయం వారు జిమ్లో గడుపుతున్నారు, ట్రైనర్ ను పెట్టుకుని ఫిట్నెస్ మెయింటైన్ చేస్తున్నారు. ఈ విషయంలో మహేష్ బాబు ముందు వరుసలో ఉంటాడు. అయితే తన 26 ఏళ్ళ సినీ కెరీర్లో ఇప్పటివరకు ఒక్క సినిమాలో కూడా షర్ట్ లేకుండా ఫైట్ చేసింది లేదు. కనీసం షర్ట్ లెస్ గా ఎక్కువ సేపు కనిపించింది కూడా లేదు.
‘అతిథి’ (Athidhi) ‘1 నేనొక్కడినే’ (1: Nenokkadine) సినిమాల్లో షర్ట్ తీసి కనిపించినా.. తన 6 ప్యాక్ ను బయటపెట్టింది లేదు. అయితే ఈసారి మహేష్ బాబు షర్ట్ లేకుండా ఫైట్ చేయాల్సి వస్తుంది. అదీ రాజమౌళి సినిమాలో. మహేష్ బాబు (Mahesh Babu) తన 29వ సినిమాని రాజమౌళి (S. S. Rajamouli) దర్శకత్వంలో చేస్తున్నారు. ఇటీవల ఒక ఫైట్ సీక్వెన్స్ చిత్రీకరించాడు రాజమౌళి.ఇందులో మహేష్ బాబు షర్ట్ లేకుండా ఫైట్ చేసినట్లు తెలుస్తుంది. సినిమాలో ఈ ఫైట్ సీక్వెన్స్ హైలెట్ గా నిలుస్తుందట.