స్టార్స్ క్రియేటివ్ కటింగ్స్

సినిమాల్లో తారలు కనిపించిన లుక్ ని అభిమానులు ఫాలో అవుతుంటారు. హీరోయిన్లు కట్టిన చీరల డిజైన్ కు మంచి గిరాకీఉంటుంది. హీరోలు వేసిన టీ షర్ట్ మోడల్ ను యువకులు ఎగబడి కొంటుంటారు. స్టార్ల హెయిర్ స్టైల్స్ ను అనుకరించే వారిజాబితాగా కూడా పెద్దదే. అలా చిత్రాల్లో పాపులర్ అయిన క్రియేటివ్ కటింగ్స్ పై ఫోకస్ …

బన్నీలుక్ తో ఆడుకోవడంలో అల్లు అర్జున్ ఎప్పుడూ ముందు ఉంటారు. బన్నీ హెయిర్ పై అనేక ప్రయోగాలు చేశారు. దేశముదురు, బద్రీనాథ్, ఇద్దరు అమ్మాయిలతో.. సినిమాల్లో విభిన్నంగా కనిపించి స్టైలిష్ స్టార్ అనిపించుకున్నాడు.

తారక్హెయిర్ తో ప్రయోగాలకు దూరంగా ఉండే జూనియర్ ఎన్టీఆర్ “నాన్నకు ప్రేమతో” సినిమాలో కనిపించిన స్టైల్ బాగా పాపులర్అయింది. అండర్ కట్ తో బ్రష్డ్ అప్ లుక్ తెగ నచ్చేసింది. ముఖ్యంగా గుబురుగా పెంచిన గడ్డం గెటప్ ను చాలామందిఅభిమానులు ఫాలో అయ్యారు.

నిఖిల్యంగ్ హీరో నిఖిల్ వరుస హిట్లు అందుకోవడంతో హెయిర్ పై ద్రుష్టి పెట్టాడు. “శంకరా భరణం”లో కొత్తగా కనిపించాడు.అందులో ఫ్యాడి అండర్ కట్ తో ఉన్న నిక్కీ హెయిర్ స్టైల్స్ కు యువత నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

రామ్నేను శైలజతో మంచి హిట్ అందుకున్న రామ్ లేటెస్ట్ ఫ్యాషన్ ట్రెండ్ ని ఫాలో అవడం కందిరీగ నుంచి మొదలు పెట్టాడు.తర్వాత పండగ చేస్కో సినిమాలో షార్ట్ స్పైకీ హెయిర్ స్టైల్ లో రామ్ హాలీవుడ్ స్టార్ ని తలపించాడు.

మహేష్ బాబుసినిమాల్లోనూ సహజంగా ఉండేందుకు ఇష్టపడే నటుడు సూపర్ స్టార్ మహేష్ బాబు. అతను అతిధి సినిమాలో నయా లుక్తో ఆకట్టుకున్నారు. గోల్డెన్ కలర్ తో ఉన్న మిడ్ లాంగ్ హెయిర్ ప్రిన్స్ అభిమానులకు బాగా నచ్చింది. తర్వాత వన్(నేనొక్కడినే) లో రాక్ స్టార్ గెటప్ తో కనిపించారు.

రామ్ చరణ్ తేజ్తొలి సినిమా చిరుతలో మిడ్ లాంగ్ హెయిర్ తో చరణ్ ఎంట్రీ ఇచ్చాడు. ఈ స్టైల్ ని చాలా మంది అనుకరించారు. ఆ తర్వాతగోవిందుడు అందరి వాడేలే సినిమాలో మిడ్ లాంగ్ హెయిర్ కి పోనీ టైల్ ని జతచేసి అమ్మాయిల మనసులుదోచుకున్నాడు.

నితిన్యువ హీరో నితిన్ అప్పుడప్పుడూ కొత్తగా కనిపించేందుకు ట్రై చేస్తుంటాడు. టక్కరి, ద్రోణా సినిమాలో నితిన్ హెయిర్ స్టైల్యువతలోకి బాగా వెళ్లాయి. ఆ తర్వాత హార్ట్ అటాక్ లో ముందు స్పైకీ వెనుక పోనీ టైల్ తో కనిపించి అదరగొట్టాడు.

ప్రభాస్యంగ్ రెబల్ స్టార్ హెయిర్ స్టయిల్ తో మాస్ అభిమానులను ఆకట్టుకున్న సినిమా మున్నా. ఇందులో డార్లింగ్ పొడువాటిజుట్టుతో కొత్తగా కనిపించాడు. ఆ తర్వాత క్లాస్ ఆడియన్స్ కి నచ్చిన లుక్ మిస్టర్ ఫర్ఫెక్ట్ లో ఉంది. ఈ మూవీలో ప్రభాస్ షార్ట్స్పైకీ స్టయిల్ ఆకట్టుకుంది.

నాగార్జునహెయిర్ స్టయిల్స్ గురించి చెప్పుకోవాలంటే ముందు గ్రీకువీరుడు, కింగ్ నాగార్జున గురించి చెప్పుకోవాల్సిందే. ఆయనకనిపించినన్ని గెటప్ (హెయిర్ స్టైల్) లో ఏ హీరో ట్రై చేయలేదు. ఎప్పటికప్పుడు రీఫ్రెష్ అవుతూ ఆయా కాలం యువతకునచ్చే లుక్ తో మన్మధుడు అనిపించుకున్నాడు. సూపర్ సినిమాలో అతని లాంగ్ హెయిర్ స్టయిల్ సూపర్. గ్రీకు వీరుడుచిత్రంలో షార్ట్ హెయిర్ స్టయిల్ తో విభిన్నంగా కనిపించి కింగ్ అనిపించుకున్నాడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus