నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రం ‘అఖండ’. మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని తన ‘ద్వారకా క్రియేషన్స్’ బ్యానర్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించాడు. ‘సింహా’ ‘లెజెండ్’ వంటి బ్లాక్ బస్టర్ కాంబినేషన్ కావడంతో డిసెంబర్ 2న విడుదలైన ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దాంతో మొదటి షోతోనే ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.
ఏపీలో టికెట్ రేట్లు చాలా తక్కువగా ఉన్నప్పటికీ.. ఈ చిత్రం భారీ వసూళ్ళనే నమోదు చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఓవర్సీస్ లో కూడా ఈ చిత్రం భారీ వసూళ్ళని నమోదు చేస్తుండడం విశేషం. సాధారణంగా మాస్ సినిమాలు చూడడానికి అక్కడి జనాలు ఇంట్రెస్ట్ చూపించరు. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు వంటి హీరోలు నటిస్తే తప్ప. అలాంటిది ‘అఖండ’ వంటి మాస్ చిత్రం ప్రీమియర్స్ తోనే ‘వకీల్ సాబ్’ రికార్డుని బ్రేక్ చేసింది.
ఇక ఇప్పటి వరకు ఈ చిత్రం అక్కడ $550K డాలర్లను వసూల్ చేసి.. దూసుకుపోతుంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ సినిమా అక్కడ 1 మిలియన్ మార్క్ ను అందుకునే అవకాశం ఉంది. ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ తప్ప ఓవర్సీస్లో బాలయ్యకి 1 మిలియన్ చిత్రం లేదు. మరి ‘అఖండ’ ఆ చిత్రం రికార్డులని బ్రేక్ చేస్తుందేమో చూడాలి..!
Most Recommended Video
‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!