ఒకప్పటి సినిమాలను ఇప్పుడు 4K కి డిజిటలైజ్ చేసి రీ రిలీజ్..లు చేస్తున్న సంగతి తెలిసిందే. ‘పోకిరి’ నుండి మొదలైన ఈ ట్రెండ్ ఇప్పటికీ కంటిన్యూ అవుతూనే ఉంది. మధ్యలో ‘జల్సా’ ‘ఖుషి’ ‘ఆరెంజ్’ ‘బిజినెస్ మెన్’ ‘వెంకీ’ వంటి సినిమాలు కూడా 4K లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. తాజాగా ‘ఓయ్’ సినిమా కూడా 4K లో రిలీజ్ అయ్యింది. 2009 వ సంవత్సరం జూలై 3 న ఈ సినిమా రిలీజ్ అయ్యింది.
ఆనంద్ రంగ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఆ టైంలో ఈ సినిమా పెద్దగా ఆడలేదు. యావరేజ్ సినిమాగా మిగిలిపోయింది. పైగా ‘గీతాంజలి 2 ‘ అంటూ కొంతమంది విమర్శించారు. అయితే రీ రిలీజ్ లో మాత్రం ఈ సినిమాకి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ లభించింది. కలెక్షన్స్ కూడా చాలా బాగా వచ్చాయి. ఇది చిత్ర బృందాన్ని సైతం షాక్ కి గురి చేసింది అని చెప్పాలి. ఈ క్రమంలో దర్శకుడు ఆనంద్ రంగ (Anand Ranga) చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి.
‘ఓయ్’ సినిమాకి రీ రిలీజ్ లో దక్కిన ఆదరణ చూస్తే ఎలా రియాక్ట్ అవ్వాలో తెలీడం లేదు. ఈ ప్రేమ ఏదో ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు చూపించి ఉంటే.. నాకు మంచి కెరీర్ దక్కేది. ఇప్పుడు ఏం లాభం.? నేను తీసింది ప్లాప్ సినిమా కాదు అని ఆ టైంలో గుర్తించి ఉంటే బాగుండేది’… అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేశాడు.