Paagal Trailer: యూత్ ను ఆకట్టుకునేలా ‘పాగల్’ ట్రైలర్..!

‘ఈ నగరానికి ఏమైంది’ ‘ఫలక్ నుమా దాస్’ ‘హిట్’ వంటి వరుస హిట్లతో మంచి ఫామ్లో ఉన్న ట్యాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ నుండీ రాబోతున్న మూవీ ‘పాగల్’. నూతన దర్శకుడు నరేష్ కుప్పిలి తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ‘లక్కీ మీడియా’ బ్యానర్ పై బెక్కం వేణుగోపాల్ నిర్మించగా ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ అధినేత దిల్ రాజు సమర్పకుడిగా వ్యవహరించారు.రధన్ సంగీత దర్శకుడు. ఆల్రెడీ విడుదల చేసిన టీజర్ కు మంచి స్పందన లభించింది.నిజానికి ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ తో వాయిదా పడింది.

ఈ మధ్యనే థియేటర్లు మళ్ళీ తెరుచుకున్న క్రమంలో ఆగష్ట్ 14న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్టు ఇటీవల ‘పాగల్’ టీం ప్రకటించింది. ఇక ప్రమోషన్లలో భాగంగా తాజాగా ట్రైలర్ ను కూడా విడుదల చేసింది. ‘నా పేరు ప్రేమ్ నేను 1600 మంది అమ్మాయిలని ప్రేమించా’ అంటూ విశ్వక్ సేన్ పలికే డైలాగ్ తో ట్రైలర్ మొదలైంది. ఈ చిత్రంలో హీరో చాలా మంది అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తూ ఉంటాడు. కానీ ఎవ్వరినీ ప్రేమించడు. చివరికి నిజంగా ఓ అమ్మాయిని(నివేదా పేతురేజ్) ను ప్రేమిస్తాడు. కానీ ఇతను పెద్ద ఫ్లర్ట్ అనే నిజాన్ని తెలుసుకుని ఇతనికి ఆమె దూరమవుతుంది.

మరి తను ప్రేమించిన అమ్మాయిని దక్కించుకోవడం కోసం హీరో ఏం చేసాడు అనేది సస్పెన్స్ గా ఉంచుతూ ట్రైలర్ ను కట్ చేశారు. విశ్వక్ సేన్ ఎప్పటిలానే ఎనర్జిటిక్ గా కనిపిస్తున్నాడు. నివేదా పేతురేజ్ మెయిన్ లీడ్ అని హింట్ ఇచ్చారు. మహేష్ ఆచంట, రాహుల్ రామకృష్ణ ల కామెడీ ఆకట్టుకునేలా కనిపిస్తుంది. ముఖ్యంగా ‘కరోనా ఉన్నవోడితో అయినా తిరగొచ్చు కానీ నీలా కరువులో ఉన్నవాడితో అస్సలు తిరగకూడదు’ అంటూ కమెడియన్ మహేష్ ఆచంట చెప్పే డైలాగ్ హైలెట్ గా నిలుస్తుందని చెప్పొచ్చు. మొత్తానికి యూత్ ను ఆకట్టుకునే అంశాలు ఈ ట్రైలర్ లో చాలానే ఉన్నాయి. సినిమా పై అంచనాలు పెంచే విధంగానే ఈ ట్రైలర్ ఉంది. మీరు కూడా ఓ లుక్కేయండి :


నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus