సెన్సార్ పూర్తి చేసుకున్న శర్వానంద్ – సాయి పల్లవి ల ‘పడి పడి లేచే మనసు’

డిఫరెంట్ చిత్రాలను తెరకెక్కించే హను రాఘవపూడి డైరెక్షన్లో శర్వానంద్ – సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం ‘పడి పడి లేచే మనసు’. క్రిస్ట్ మస్ కానుకగా డిసెంబర్ 21 న విడుదల కాబోతున్న చిత్రాన్ని ‘ఎస్.ఎల్.వి సినిమాస్’ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. ఇటీవల ఈ చిత్రానికి సంబందించిన సెన్సార్ పనులు పూర్తయ్యాయి.

డిఫరెంట్ లవ్ స్టోరీ గా తెరకెక్కిన ఈ చిత్రానికి ఎలాంటి కట్స్ విధించకుండా సెన్సార్ బోర్డు క్లీన్ ‘యూ’ సర్టిఫికేట్ ను ఇవ్వడం విశేషం. ఈ చిత్రం ఫస్ట్ హాఫ్ అంతా మంచి వినోద పరిచే సన్నివేశాలు.. ప్రియదర్శి, వెన్నెల కిషోర్ కామెడీతో సరదా సరదాగా సాగిపోతుందట. ఇక సెకండ్ హాఫ్ లో శర్వానంద్ – సాయి పల్లవి కి మధ్య వచ్చే లవ్ అండ్ ఎమోషన్ సెన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలువబోతున్నాయని సమాచారం. విశాల్ చంద్ర శేఖర్ పాటలతో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో కూడా ఆకట్టుకుంటాడని తెలుస్తోంది. మరి ఈ చిత్రం ఏ రేంజ్ విజయం సొంతం చేసుకుంటుందో తెలియాలంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus