ప‌డిప‌డి లేచె మ‌న‌సు థియేట్రికల్ ట్రైలర్ | శ‌ర్వానంద్, సాయిప‌ల్ల‌వి

శ‌ర్వానంద్, సాయిప‌ల్ల‌వి జంట‌గా న‌టిస్తున్న ప‌డిప‌డి లేచె మ‌న‌సు. ఈ చిత్ర ఆడియో జ్యూక్ బాక్స్ మార్కెట్ లోకి నేరుగా విడుద‌లైంది. హ‌ను రాఘ‌వ‌పూడి ఈ చిత్రాన్ని నేపాల్, హైద‌రాబాద్, కోల్ క‌త్తాల్లోని అద్భుత‌మైన లొకేష‌న్స్ లో చిత్రీక‌రించారు. ముర‌ళి శ‌ర్మ‌, సునీల్ ఇందులో కీల‌క‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. విశాల్ చంద్ర‌శేఖ‌ర్ సంగీతం అందిస్తున్నఈ చిత్ర పాట‌ల‌కు ఇప్ప‌టికే అద్భుత‌మైన స్పంద‌న వ‌స్తుంది. ప‌డిప‌డి లేచె మ‌న‌సుకు జేకే సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. శ్రీ ల‌క్ష్మీ వెంక‌టేశ్వ‌ర సినిమాస్ సంస్థ‌లో సుధాక‌ర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డిసెంబ‌ర్ 21న ప‌డిప‌డి లేచె మ‌న‌సు ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంది.

Read Today's Latest Trailers Update. Get Filmy News LIVE Updates on FilmyFocus