మూడున్నర గంటల సినిమానా?

  • October 31, 2017 / 11:06 AM IST

కొందరు దర్శకులు సినిమాకి ప్రాణం పెట్టేస్తుంటారు. ఎంతలా అంటే సినిమా రన్ టైమ్ ఎంత అనే విషయాన్ని పట్టించుకోకుండా రాసుకొన్న సన్నివేశాలన్నిట్నీ తెరకెక్కించేస్తుంటారు. ఇదివరకట్లా ప్రేక్షకులు మూడు లేదా మూడన్నర గంటల సినిమాలు చూడ్డానికి పెద్దగా ఇష్టపడడం లేదు. రీసెంట్ గా “అర్జున్ రెడ్డి, మెర్సల్ (తెలుగులో “అదిరింది”) చిత్రాలు మూడు గంటలపాటు సాగినా కామెడీ, యాక్షన్, ఎమోషన్ వంటివి పుష్కలంగా ఉండడంతో ఆ సినిమాలను ఆడియన్స్ ఆదరించారు. అయితే.. తాజాగా బాలీవుడ్ క్లాసిక్ డైరెక్టర్ గా పేరొందిన సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన తాజా చిత్రం “పద్మావతి”. తిరుపతి మహారాణి పద్మావతి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది.

సినిమా రన్ టైమ్ మొత్తంగా నాలుగు గంటలు రాగా.. ఎడిటర్ దగ్గర కూర్చుని మరీ సంజయ్ లీలా మూడున్నర గంటలు కట్ చేయించాడట. అయితే.. సినిమా చూసిన కొందరు బాలీవుడ్ పెద్దలు “ఇంత రన్ టైమ్ అవసరం లేదేమో, కాస్త ఎడిట్ చేయండి” అని సూచనాలిచ్చారట. అయితే.. భన్సాలీ మాత్రం ఆడియన్స్ ఒక్కసారి ఎమోషన్ కి కనెక్ట్ అయితే అసలు రన్ టైమ్ ఎంత అనేది పట్టించుకోరని చెబుతున్నాడట. వందల కోట్లు ఖర్చు చేసి తెరకెక్కించిన చిత్రాన్ని కేవలం నిడివి పెరిగిందనే ఒకే ఒక్క రీజన్ తో ఎడిటింగ్ చేసేయడం కరెక్ట్ కాదని భావిస్తున్నాడట భన్సాలీ. దీపిక పడుకోణే టైటిల్ రోల్ ప్లే చేస్తున్న ఈ చిత్రంలో రణవీర్ సింగ్, షాహిద్ కపూర్ లు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. డిసెంబర్ మొదటివారంలో విడుదలవ్వనున్న ఈ చిత్రం సెన్సార్ పూర్తయ్యేవరకూ రన్ టైమ్ ఎంత అనేది భన్సాలీకి తప్ప ఎవరికీ ఐడియా ఉండదేమో.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus