స్టార్ హీరోయిన్ సమంత ఈ మధ్య కాలంలో పలు వివాదాల ద్వారా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. సమంత తప్పు లేకపోయినా ఆమెను వివాదాలు చుట్టుముడుతున్నాయి. పుష్ప పార్ట్1 మూవీలో సమంత స్పెషల్ సాంగ్ చేయగా ఇప్పటికే విడుదలైన ఈ పాట లిరికల్ వీడియో, ప్రోమో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అయితే ఈ పాట లిరిక్స్ విషయంలో వివాదం తలెత్తింది. మగాళ్లను కించపరిచేలా ఈ పాట ఉందని ఏపీలో పురుషుల సంఘం ఫిర్యాదు చేయడం గమనార్హం.
అయితే మరోవైపు ఏపీలోని మహిళా సంఘం మాత్రం సమంతను సపోర్ట్ చేస్తూ పాలాభిషేకం చేస్తుండటం గమనార్హం. యూట్యూబ్ లో ఊ అంటావా మావా పాటకు రికార్డు స్థాయిలో వ్యూస్ వస్తున్నాయి. ఫోక్ సింగర్ ఇంద్రావతి చౌహాన్ ఈ పాటను పాడగా ఆమె వాయిస్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అమరావతిలోని తాళ్లూరు గ్రామంలో మహిళా మండలి సభ్యులు సమంత, చంద్రబోస్ పేర్లపై అర్చనతో పాటు వాళ్లిద్దరి పేర్లపై పాలాభిషేకం కూడా చేశారు.
మహిళా మండలి సభ్యులు మీడియాతో మాట్లాడుతూ పుష్ప మూవీని తొలిరోజే థియేటర్లలో చూస్తామని ఊ అంటావా పాటకు ఈలలు వేస్తూ చప్పట్లు కొడతామని చెప్పుకొచ్చారు. ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిన పుష్ప మరికొన్ని గంటల్లో థియేటర్లలో విడుదల కానుంది. ఫహద్ ఫాజిల్, సునీల్, అనసూయ ఈ సినిమాలో నెగిటివ్ రోల్స్ లో నటిస్తున్నారు. పుష్ప సక్సెస్ పై మేకర్స్ ఎంతో నమ్మకంతో ఉన్నారు. వచ్చే ఏడాది పుష్ప పార్ట్2 రిలీజ్ కానుంది.
బన్నీ పుష్ప పార్ట్2 పూర్తి చేసిన ఆ తర్వాత కొత్త సినిమా పనులతో బిజీ కానున్నారు. 180 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కగా సమంత స్పెషల్ సాంగ్ కోసమే మేకర్స్ 5 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని సమాచారం. పుష్ప మూవీ రిలీజైన తర్వాత నిర్మాతలకు ఏ స్థాయిలో లాభాలను అందిస్తుందో చూడాల్సి ఉంది. పుష్ప పార్ట్2 షూటింగ్ కూడా ఇప్పటికే కొంతభాగం పూర్తైందని తెలుస్తోంది.