Pawan Kalyan: పంజా మూవీ కోసం ఇన్ని టైటిల్స్ ను పరిశీలించారా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ కెరీర్ లోని ప్రత్యేకమైన సినిమాలలో పంజా సినిమా కూడా ఒకటి. కోలీవుడ్ డైరెక్టర్ విష్ణువర్ధన్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా 2011 సంవత్సరం డిసెంబర్ 9వ తేదీన థియేటర్లలో విడుదలైంది. పవన్ కళ్యాణ్ అభిమానులకు ఈ సినిమా ఎంతగానో నచ్చింది. అయితే కథ, కథనం ఆకట్టుకోలేకపోవడంతో ఈ సినిమా ఫ్లాపైంది. హీరోయిన్ల పర్ఫామెన్స్ కూడా ఈ సినిమాకు మైనస్ అయింది. అయితే ఈ సినిమాకు మొదట పరిశీలించిన టైటిల్ ది షాడో కావడం గమనార్హం.

ది షాడో వర్కింగ్ టైటిల్ తోనే ఈ సినిమా మొదలైంది. ఈ టైటిల్ తో పాటు ఈ సినిమాకు పటేల్, తిలక్, కాళీ, పవర్ మరికొన్ని టైటిల్స్ ను పరిశీలించారు. పంజా సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించకపోయినా ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో కొత్త లుక్ లో కనిపించిన సంగతి తెలిసిందే. పంజా సినిమాలోని పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

మరోవైపు పవన్ కళ్యాణ్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాలను పూర్తి చేస్తానని చెప్పడం అభిమానులకు సంతోషాన్ని కలిగిస్తోంది. రాబోయే 9 నెలల్లో పవన్ నటించిన మూడు సినిమాలు షూటింగ్ లను పూర్తి చేసుకుని రిలీజ్ కానున్నాయి. ఈ మూడు సినిమాలపై ప్రేక్షకులలో మంచి అంచనాలు నెలకొన్నాయి.

పవన్ తాజా ప్రకటనతో పవన్ తో సినిమాలను నిర్మించాలని అనుకున్న నిర్మాతలు సైతం హ్యాపీగా ఫీలవుతున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పొలిటికల్ ట్రిప్ ను పక్కన పెట్టిన నేపథ్యంలో వరుసగా పవన్ హీరోగా సినిమాల షూటింగ్ లు వరుసగా జరగనున్నాయని తెలుస్తోంది. తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా పవన్ విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!
నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ గీతు రాయల్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus