అర్జున్ అంబటి ‘పరమపద సోపానం’ ఫస్ట్ సింగిల్ వైరల్!

‘అర్ధనారి’ ‘తెప్ప సముద్రం’ ‘వెడ్డింగ్ డైరీస్’ వంటి వైవిధ్యమైన సినిమాల్లో హీరోగా నటించిన అర్జున్ అంబటి.. ఆ తర్వాత ‘బిగ్ బాస్’ రియాలిటీ షో తో ఫ్యామిలీ ఆడియన్స్ కు కూడా దగ్గరయ్యాడు. అతను హీరోగా రూపొందిన ‘పరమపద సోపానం’ (Paramapadha Sopanam) రిలీజ్ కి రెడీగా ఉంది. టైటిల్ తోనే అందరి దృష్టిని ఆకర్షించిన ఈ సినిమా ఓ థ్రిల్లర్. జెన్నిఫర్ ఇమ్మాన్యుయేల్ ఈ చిత్రంలో హీరోయిన్. ‘ఎస్.ఎస్.మీడియా’ సంస్థ పై గిడిమిట్ల శివ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి గుడిమెట్ల ఈశ్వర్ సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

Paramapadha Sopanam

స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ అసిస్టెంట్ అయినటువంటి నాగ శివ ఈ సినిమాకు దర్శకుడు. ఆల్రెడీ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. జూలై 11న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ప్రమోషన్లో భాగంగా ‘చిన్ని చిన్ని తప్పులేవో’ అనే లిరికల్ సాంగ్ ను ఈరోజు విడుదల చేశారు.

బీచ్ సాంగ్స్ ఎప్పుడూ ఓ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటాయి. ‘పరమపద సోపానం’ (Paramapadha Sopanam) లోని ఈ పాట కూడా అదే విధంగా ఉందని చెప్పవచ్చు. రవితేజ ‘ఈగల్’ సినిమాకి సంగీత దర్శకుడిగా పని చేసిన డేవ్ జాండ్ ఈ సినిమాకి కూడా సంగీతం అందించారు. ఈ పాటలో అర్జున్ అంబటి, హీరోయిన్ జెన్నిఫర్ వేసిన హుక్ స్టెప్ ఆకట్టుకునే విధంగా ఉంది.

జెన్నిఫర్ గ్లామర్ కూడా కుర్రకారుని ఆకర్షిస్తుంది. ట్యూన్ తో పాటు సింగర్స్ పృథ్వీ చంద్ర, అదితి భావరాజు ఎంతో హుషారుగా ఈ పాటను ఆలపించారు. రాంబాబు గోశాల అందించిన లిరిక్స్ కూడా క్యాచీగా ఉన్నాయి. ప్రస్తుతం ఈ పాట వైరల్ అవుతుంది. మీరు కూడా చూస్తూ వినండి :

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus