Paresh Rawal: వాళ్లకు అలాంటి శిక్షలు అమలు చేయాలి.. నటుడి కామెంట్స్ వైరల్!

మన దేశంలో ఇప్పటివరకు ఏడు విడతల్లో ఐదు విడతల పోలింగ్ పూర్తైంది. కొన్ని రాష్ట్రాల్లో పోలింగ్ శాతం ఎక్కువగా ఉంటే మరికొన్ని రాష్ట్రాల్లో పోలింగ్ శాతం మరీ తక్కువగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఎక్కువ సంఖ్యలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. అయితే కొంతమంది ఓటు హక్కును కలిగి ఉన్నా ఓటు హక్కును వినియోగించుకోవడం లేదు. ఓటు హక్కును వినియోగించుకోని వాళ్ల విషయంలో కఠినమైన రూల్స్ అమలులోకి తీసుకొనిరావాలని చాలా కాలం నుంచి డిమాండ్స్ వ్యక్తమవుతున్నాయి.

అయితే టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలలో మంచి గుర్తింపును సొంతం చేసుకున్న పరేష్ రావెల్ (Paresh Rawal) ఓటు వేయని వాళ్లకు భారీగా ట్యాక్స్ విధించాలి అంటూ సంచలన వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. చాలామంది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సరిగ్గా పని చేయలేదని విమర్శలు, నెగిటివ్ కామెంట్లు చేస్తుంటారని పరేష్ రావల్ చెప్పుకొచ్చారు.

ఓటు హక్కు కలిగి ఉండి కూడా వినియోగించుకోకపోతే ఆ పనులు జరగకపోవడానికి మీరే బాధ్యులు అవుతారని ఆయన తెలిపారు. ఎవరైతే ఓటు హక్కును వినియోగించుకోరో వాళ్లకు ప్రభుత్వాన్ని నిందించే హక్కు లేదని పరేష్ రావల్ పేర్కొన్నారు. ఓటు వెయ్యని వాళ్ల విషయంలో చర్యలు తీసుకునేలా కొత్త రూల్స్ రావాల్సిన అవసరం ఉందని పరేష్ రావల్ వెల్లడించారు.

ఎవరైతే ఓటు హక్కును వినియోగించుకోరో వాళ్ల నుంచి భారీగా ట్యాక్స్ విధించడం లేదా మరేదైనా కఠినమైన శిక్షను విధించడం చేయాలని పరేష్ రావల్ పేర్కొన్నారు. ముంబైలో ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత పరేష్ రావల్ ఈ కామెంట్లు చేసి వార్తల్లో నిలిచారు. పరేష్ రావల్ చేసిన కామెంట్స్ లో కూడా నిజం ఉందని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. పరేష్ రావల్ కామెంట్ల గురించి కొంతమంది మాత్రం నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus