బాలీవుడ్ స్టార్ హీరోయిన్ పరిణితి చోప్రా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రాకి ఈమె చెల్లెలు అవుతుంది అనే సంగతి కూడా అందరికీ తెలిసిందే. ‘కేసరి’ వంటి హిట్ సినిమాలతో బాలీవుడ్లో తన సత్తా చాటింది పరిణితి చోప్రా. ఇక ఈమె ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చడ్డాని పెళ్లాడబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇద్దరూ ప్రైవేట్ గా ఎంగేజ్మెంట్ చేసుకోవడం కూడా జరిగింది. వీరి నిశ్చితార్ధ వేడుకకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. పలువురు సినీ,రాజకీయ నాయకుల సమక్షంలో ఎంతో ఘనంగా ఢిల్లీలో వీరి నిశ్చితార్థం జరిగింది.
లండన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో వీరిద్దరూ కలిసి చదువుకున్నారు. పరిణితి- రాఘవ్ ల మధ్య ఉన్న స్నేహం ప్రేమగా మారడంతో పెద్దలు కూడా వీరి పెళ్ళికి అంగీకరించడం జరిగింది. ఇక పరిణితి సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకోగా.. రాఘవ్ చద్దా ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీగా రాజకీయాలలో కొనసాగుతున్నారు.
ఇక పరిణితి – రాఘవ్ ల నిశ్చితార్థం జరిగి మూడు నెలలు దాటినా.. ఇంకా వీరి పెళ్లి డేట్ గురించి ఎటువంటి వార్తలు రాలేదు. మంచి ముహుర్తాలు లేకపోవడం వల్లనే వీరి పెళ్లి వాయిదా పడింది అనే కామెంట్స్ వినిపించాయి. ఇక సెప్టెంబర్ 25 న పరిణితి – రాఘవ్ ల పెళ్లి జరగబోతున్నట్టు తాజా సమాచారం. సెప్టెంబర్ 7 నుండి పెళ్లి పనులు మొదలవుతాయని తెలుస్తుంది.