పవన్ సినిమాలు వదిలేశాక ఆయన అభిమానులు ఎంతగా బాధపడ్డారో.. రాజకీయాల్లో ఆయన ప్రజలకు చేరువవుతుంటే అంతకుమించిన ఆనందంతో ఉక్కిరికిబిక్కిరయ్యారు. అంతటితో ఆగలేదు ఆయనకు తోడుగా నడుస్తున్నారు. ఈ రాజకీయాలంటేనే పెంట అని అందరికీ తెలిసిందే. ఇక్కడ ఆరోగ్యకరమైన డిస్కషన్స్ ఉండవు. అయితే.. పర్సనల్ గా టార్గెట్ చేస్తారు లేదంటే.. ఫ్యామిలీని కూడా ఈ రోతలోకి లాగుతారు.
ఈ విషయమై పరుచూరి గోపాలకృష్ణ జనసేనాని పవన్ కళ్యాణ్ కు సూచనలు ఇచ్చారు. “పవన్ కళ్యాణ్ నువ్ ఇకపై చాలా జాగ్రత్తగా ఉండాలి, ఓటమిని అస్సలు అంగీకరించకు. అలాగే.. నిన్ను పర్సనల్ గా లేదా ఫ్యామిలీ పరంగా ఎవరైనా టార్గెట్ చేసినా.. తిట్టినా నువ్ మాత్రం నీ సహనాన్ని కోల్పోయి.. వాళ్ళు చేసిన తప్పును మాత్రం చేయకు” అంటూ టిప్స్ ఇచ్చారు. నిజమే.. ఇప్పటివరకూ పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసినవాళ్ళందరూ ఆయన మూడు పెళ్లిళ్ల గురించి ప్రస్తావించిన వారే తప్ప ఆలోచనాత్మక విమర్శ చేసినవారు లేరు. సొ పవన్ కళ్యాణ్ మన పరుచూరి గారి మాటలను దృష్టిలో పెట్టుకోవడం మంచిది.